సెలెక్టివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), ఇప్పుడు ఓ ప్రొడక్షన్ హౌస్‌తో లాంగ్ టర్మ్ డీల్ కుదుర్చుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. తమిళంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో తన మార్క్ నిలబెట్టుకున్న లోకేష్, తాజాగా కన్నడలో భారీ సినిమాలు నిర్మించే KVN ప్రొడక్షన్స్ తో మూడు సినిమాల డీల్ సైన్ చేసినట్టు సమాచారం. ఇది త్రిపుల్ షాట్ లాంటి డీల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తన సినిమాలన్నింటికీ ప్రత్యేకమైన కథ, విభిన్న ట్రీట్‌మెంట్ ఇచ్చే లోకేష్.. ఈ మూడింటికీ కూడా వేరే కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక ప్రాజెక్ట్ టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌తో ఉండబోతుందనే వార్తలే ఇప్పుడు హైలైట్. చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు (Buchi Babu Sana) RC16తో బిజీగా ఉండగా ఆ తరువాత, RC17ని సుకుమార్ తో (Sukumar) చేయనున్నాడు. ఇక RC18గా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోందట.
ఇది ఎల్‌సీయూ యూనివర్స్ లో భాగమా లేక ఫ్రెష్ కాన్సెప్ట్ ఫిల్మా అన్నది ఇంకా అఫీషియల్‌గా రాలేదు. మిగిలిన రెండు ప్రాజెక్టుల్లో ఖైదీ 2(Kaithi) (కార్తీ) (Karthi) ఉండే ఛాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాల టాక్. మరోటి రోలెక్స్ పాత్ర ఆధారంగా సూర్య (Suriya) హీరోగా రూపొందే సినిమా కావచ్చని ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. ‘విక్రమ్’లో (Vikram) చివర్లో సూర్య క్యారెక్టర్ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రోల్‌ను మరింత స్ట్రాంగ్ గా హైలెట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.
ఈ మూడు సినిమాల ప్లానింగ్, కాస్టింగ్, మేకింగ్ లెవల్స్… లోకేష్ కనగరాజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డుగా నిలిపే ఛాన్స్ ఉంది. అంతేగాక, కోలీవుడ్, టాలీవుడ్ మార్కెట్‌లను ఒకే రేంజ్‌లో క్యాప్చర్ చేసే విధంగా KVN ప్లానింగ్ చేస్తున్నదని సమాచారం. ఇక రామ్ చరణ్ – లోకేష్ కనగరాజ్ కాంబోపై ఇప్పటికే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలెట్టేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని ఫిల్మ్ నగర్ టాక్.