తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ చేసిన ‘ఖైదీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అది ఒక కల్ట్ సినిమా అని ఫీలయ్యే జనాలు చాలామందే ఉన్నారు. ఆ సినిమా చూసినవాళ్లంతా కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.’ఖైదీ’ రిజల్ట్ తో లోకేష్ కి విజయ్ రూపంలో పెద్ద ఛాన్స్ లభించింది. ‘మాస్టర్’ సినిమాకి రిలీజ్ కి ముందు ఎంత హైప్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు.. అంచనాలను డబుల్ చేశాయని చెప్పొచ్చు. కానీ ‘మాస్టర్’ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. విజయ్ ఇమేజ్ కి ఆ సినిమా మ్యాచ్ అవ్వకపోగా.. లోకేష్ సినిమాల పై అనుమానాలు కలిగేలా కూడా చేసింది ‘మాస్టర్’. దీంతో ‘విక్రమ్’ వంటి భారీ మల్టీస్టారర్ పై జనాలకి అనుమానాలు కూడా ఏర్పడ్డాయి. కానీ (Lokesh Kanagaraj) ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ ను క్రియేట్ చేసి.. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు లోకేష్.
అది జనాలకి బాగా నచ్చింది. ఇటీవల వచ్చిన ‘లియో’ పై భారీ అంచనాలు పెరగడానికి కూడా అది కారణమైంది. కానీ ఆ అంచనాలను ‘లియో’ పూర్తిస్థాయిలో మ్యాచ్ చేయలేదు. మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘లియో’, ఇప్పుడు మాత్రం డౌన్ అయిపోయింది అని చెప్పాలి. విజయ్ తో లోకేష్ ఎందుకు ఇలా తీశాడు అని అభిమానులు కూడా నెత్తి కొట్టుకుంటున్నారు. విజయ్ విషయంలో ఎలా ఉన్నా, నెక్స్ట్ లోకేష్ .. రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా విషయంలో ముందు నుండి అతను చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రజినీకాంత్ కి ప్లాప్ ఇస్తే.. తర్వాత అంత ఈజీగా అవకాశాలు రావు. ‘సిరుతై’ శివ సంగతి చూసాం కదా. పా రంజిత్ కూడా వెనుకబడ్డాడు. మురుగదాస్ సంగతి చెప్పనవసరం లేదు. కాబట్టి లోకేష్ ముందు నుండి జాగ్రత్త పడి.. ఆ ‘ఎల్.సి.యు’ వరల్డ్ ను కూడా ఎక్కువ వాడకపోవడం ఉత్తమం.