Love Story Movie: ఇంత జరుగుతున్నా నిర్మాతలు గమ్మునున్నారెందుకో

‘పవన్‌ కల్యాణ్‌ మాటలతో మాకేం సంబంధం లేదు…’ అంటూ ఇటీవల ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ లేఖ విడుదల చేసింది గుర్తుందా? తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సహకరిస్తున్నాయని అని కూడా ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇది చూసి ‘అవునా… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, అందులోనూ ఏపీ ప్రభుత్వం అంత పాజిటివ్‌గా ఉందా’ అంటూ అందరూ ఆలోచించసాగారు. అయితే గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది? నిర్మాతలు చెబుతున్న మాటలు అన్నీ తప్పుగా కనిపిస్తున్నాయి.

నిర్మాతల మండలి అధ్యక్షుడు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ పేరు మీద ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లెటర్‌ బయటకు వచ్చింది. అంటే ఆ మాటలు ఆయన అన్నట్లే. ఇక్కడ విషయం ఏంటంటే… ఇప్పుడు థియేటర్లలో ఉన్న సినిమా ‘లవ్‌ స్టోరీ’ ఆయన నిర్మాణంలో రావడం గమనార్హం. అంతేకాదు ఆ సినిమాకు రావాల్సిన దాని కంటే తక్కువ వస్తుండటం ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. కావాలంటే ‘లవ్‌స్టోరీ’ తొలి వారాంతం వసూళ్ల సంగతే చూద్దాం. మీకే సులభంగా అర్థమైపోతుంది.

ఏపీలో ‘లవ్‌స్టోరీ’ తొలి వారంతంలో సుమారు ₹2.8 కోట్లు వసూలు చేసింది. ఏముంది మంచి నెంబరులే అనుకోవచ్చు. ఇదే సమయంలో నైజాం ఏరియాలో ఈ సినిమా సుమారు ₹3 కోట్లు వసూలు చేసింది. గతంలో సినిమాల వసూళ్లు చూస్తే… నైజాం కంటే సుమారు 50 నుండి 60 శాతం వసూళ్లు ఏపీలో ఉంటాయి. ఆ లెక్కన ఏపీలో ‘లవ్‌స్టోరీ’కి సుమారు ₹2.5 కోట్లు నష్టం వచ్చింది. ఇదేదో గాలి లెక్క కాదు పసుమా. ‘ఉప్పెన’ సినిమా చూసుకుంటే తొలి వారంతంలో నైజాంలో సుమారు ₹3.08 కోట్లు వసూలు చేసిందట. అదే సమయంలో ఏపీలో సుమారు ₹4.87 కోట్లు వసూలు చేసింది.

ఈ లెక్కలు చూసి చెప్పొచ్చు సినిమా ఎంత మేర నష్టపోయిందో చెప్పొచ్చు. అయితే ఇవేవీ నిర్మాతలకు పట్టినట్లు లేదు. మా సినిమాకు ఏపీ ప్రభుత్వం బాగా మద్దతు ఇస్తోందని చెబుతున్నారు. ఎప్పుడు అనే డౌట్‌ ఉందా. మొన్న పవన్‌ వ్యాఖ్యలకు సంబంధించిన లెటర్‌లో ఇదే రాశారు కదా. ఇక వసూళ్లు తగ్గడానికి కారణాలంటారా.. ఏమున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్‌ షోలు లేకపోవడం, టికెట్‌ ధరలు బాగా తక్కువగా పెట్టడమే. ఇవి తెలిసినవే. మరి నిర్మాత ఎందుకలా చేశారు అంటే… ఆయనే సమాధానం చెప్పాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus