Mahaveerudu Twitter Review: ‘మహావీరుడు’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి సినిమాలతో తెలుగులో కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ అనే మూవీ కూడా చేసాడు కానీ.. అది అంతగా ఆడలేదు. అయితే ఇప్పుడు ‘మహావీరుడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అదితి శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ‘శాంతి టాకీస్‌’ పతాకంపై అరుణ్‌ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ లీడింగ్ బ్యానర్స్ లో ఒకటైన ‘ఏషియన్ సినిమాస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. జూలై 14 న అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందట.

శివ కార్తికేయన్ నటన బాగున్నప్పటికీ కథ టేకాఫ్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం పట్టిందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓకే అనిపిస్తుంది అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా .. తర్వాత సింక్ కాని సన్నివేశాలు వచ్చి విసిగించాయి అని చెబుతున్నారు. క్లైమాక్స్ పోర్షన్ ఓకే అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా (Mahaveerudu) కాన్సెప్ట్ బాగున్నా .. ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా మాత్రమే ఉందని అంటున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus