అల్లు రామలింగయ్య గారి నటన గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆయన నటించిన పాత సినిమాలను కనుక చూస్తే ఎవ్వరైనా ఆయన నటనకి,కామెడీకి ఫిదా అయిపోవాల్సిందే.అభిమానులు అయిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. అల్లు రామలింగయ్య గారికి తన మనవడు రాంచరణ్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్,చరణ్ లు ఎక్కువగా అతని వద్దే పడుకునే వారు. ప్రతీరోజు వాళ్ళకి నిద్రపుచ్చే ముందు కొన్ని కథలు, మంచి మాటలు చెప్పేవారట అల్లు రామలింగయ్య గారు.
అందులో ఓ మాటని చరణ్ ఇప్పటికీ పాటిస్తూ ఉంటాడట. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు ‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ ఆచంట. ‘రంగస్థలం’ సెట్స్ లో చరణ్ ఎక్కువగా సైలెంట్ గా ఉండేవాడట.దర్శకుడు సుకుమార్,సమంత, ఆది వంటివారు ఎంత మాట్లాడినా.. అల్లరి చేసినా చరణ్ మాత్రం ఎక్కువగా మాట్లాడేవాడు కాదట.దీని గురించి ఓసారి ధైర్యం చేసి చరణ్ ను అడిగేశాడట మహేష్ ఆచంట. దానికి చరణ్.. తన తాతగారు అల్లు రామలింగయ్య గారితో ఉన్న అనుబంధం గురించి వివరించి..
అలాగే ఆయన చెప్పిన ఓ మంచి మాటని చెప్పుకొచ్చాడట. ఆ మాట ఏంటంటే.. ‘పెదవి దాటిన మాటకి నువ్వు బానిస అయితే పెదవి దాటని మాటకి నువ్వు రాజు’ అని. అందుకే చరణ్ అంత సైలెంట్ గా ఉంటాడని.. అతని తాత గారి మాటకి అంత విలువ ఇస్తాడని ..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఆచంట చెప్పుకొచ్చాడు.