Mahesh Babu: సముద్రఖని పాత్ర గురించి మహేష్‌ భలే చెప్పారుగా!

టాలీవుడ్‌కి ఇటీవల దొరికిన వెర్సటైల్‌ నటుల్లో సముద్ర ఖని ఒకరు. తమిళంలో మంచి దర్శకుడు పేరు తెచ్చుకున్నా.. అంతకుమించి నటుడిగా పేరు తెచ్చుకున్నారు సముద్రఖని. వెర్సటైల్‌ పాత్రలన్నీ ఆయన్ను వెతుక్కుంటూ చెన్నై వెళ్తున్నాయి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. చిన్నపాటి మేనరిజమ్‌ను యాడ్‌ చేసి పాత్రను డబుల్‌ ఇంజిన్‌తో రైడ్‌ చేస్తుంటారు సముద్రఖని. ఇప్పుడు ఆయన ‘సర్కారు వారి పాట’ సినిమాలో రాజేంద్రనాథ్‌ అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రాజేంద్రనాథ్‌ పాత్ర కోసం ఎవర్ని తీసుకోవాలా? అని మహేష్‌బాబు, పరశురామ్‌ చాలా రోజులు ఆలోచించారట.

ఫస్ట్‌ షెడ్యూల్‌, సెకండ్‌ షెడ్యూల్‌, లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత కూడా ఆ పాత్రకు ఎవర్ని ఎంచుకోవాలనే దానిపై నిర్ణయానికి రాలేకపోయారట. పరశురామ్‌ చాలా మంది పెద్ద పెద్ద నటుల పేర్లు చెప్పినా మహేష్‌ అంత ఆసక్తి చూపించలేదట. ‘వాళ్లు ఈ రోల్‌ చేయరండి’ అని మహేష్‌ తెగేసి చెప్పేవాడట. అలా ఓ రోజు రాజేంద్రనాథ్‌ పాత్రకు సముద్రఖని అయితే బాగుంటుందని మహేష్‌ చెప్పారట. దీంతో వెంటనే సముద్రఖనికి ఫోన్‌ చేసి మాట్లాడారట. ఆయన కూడా వెంటనే ఓకే చేశారు.

ఈ విషయంలో ఆయనకు బిగ్‌ థ్యాంక్స్‌ చెప్పాలి అని అంటాడు మహేష్‌. లాస్ట్‌ డే షూట్‌ రోజు మహేష్‌బాబు దగ్గరకు సముద్రఖని వచ్చి ‘సర్‌ ఈ సినిమాలో మీరు చాలా కళ్లజోళ్లు పెట్టుకున్నారు కదా. అందులో నాకు ఒకటి గిఫ్ట్‌గా ఇస్తే దాన్ని మీ గుర్తుగా ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాను’ అని అడిగారట.అయితే సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తయ్యాక సముద్రఖని పోర్షన్‌, డబ్బింగ్‌ చూశారట మహేష్‌బాబు. ఆయన నటనకు, స్క్రీన్‌ ప్రజెన్స్‌కి ఫిదా అయిపోయిన మహేష్‌బాబు ఆయనకు ఒక్క కళ్లజోడు కాదు…

ఏకంగా కళ్లజోళ్ల కొట్టే ఇవ్వాలని అని అనుకున్నారట. అంతలా రాజేంద్రనాథ్‌ పాత్రలో అదరగొట్టేశారట సముద్రఖని. సినిమా ట్రైలర్‌ మనం రాజేంద్ర నాథ్‌ పాత్ర యాటిట్యూడ్‌ను చూడొచ్చు. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మహేష్‌ చెబుతున్న దాని ప్రకారం అయితే రాజేంద్రనాథ్‌ ఇంకా అదరగొడతాడు అన్నమాట.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus