Mahesh Babu: సంక్రాంతి రేసులోనే సర్కారు పాట.. కానీ?

మహేష్ బాబు కీర్తి సురేష్ కాంబినేషన్ లో పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2022 సంవత్సరం జనవరి 13వ తేదీన విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడిన నేపథ్యంలో సర్కారు వారి పాట పోస్ట్ పోన్ కానుందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో జనవరి 13వ తేదీనే సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించిన నేపథ్యంలో సర్కారు వారి పాట సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు కన్ఫామ్ అయింది. సర్కారు వారి పాట వేసవికి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తుండగా మేకర్స్ పోస్టర్ ద్వారా ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ కు పోటీగా సర్కారు వారి పాట రిలీజ్ కానుండటం ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు షాక్ అనే చెప్పాలి.

అయితే ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీ కూడా విడుదల కాకపోవచ్చని అందుకే సంక్రాంతి సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకోవడానికి సిద్ధపడటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైతే మాత్రమే సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశం అలా జరగని పక్షంలో ఈ సినిమాల రిలీజ్ డేట్లు మారవని సమాచారం. 2022 సంక్రాంతి కానుకగా ఎన్ని సినిమాలు రిలీజవుతాయో ఆ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.