SSMB28: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా విజయం ఎంత అవసరం?!

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా ఎప్పుడు మొదలు? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కారణమేంటి అని ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఎందుకంటే మహేష్‌కు ఇప్పుడు భారీ విజయం ఒకటి పక్కాగా కావాలి. అదేంటి రీసెంట్‌ మూవీస్‌ అన్నీ హిట్టే కదా అంటారా? అవును, అన్నీ హిట్లే. అయితే మహేష్‌ ఫ్యాన్స్‌ను కేవలం హిట్‌తోనే సరిపెట్టేస్తే ఎలా. ఇండస్ట్రీ బ్లాక్‌ బస్టర్‌లు ఉండాలి. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ నుండి అలాంటి సినిమా రాలేదనే చెప్పాలి.

ఇలా ఇన్ని కారణాలతో త్రివిక్రమ్‌ సినిమా విషయంలో ఫ్యాన్స్‌ చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ నుండి వచ్చిన ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’ దారుణ పరాజయం పొందాయి. ఆ తర్వాత చేసిన ‘భరత్‌ అనే నేను’ మంచి విజయం అందుకున్నా.. కొన్ని చోట్ల నష్టాలు వచ్చాయని దర్శకుడు కమ్‌ రిలీజ్‌లు చూసిన కొరటాల శివ చెప్పారు. ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ విజయాలు అంత భారీవి కావు.

త్రివిక్రమ్‌తో 11 ఏళ్ల తర్వాత మహేష్‌ కలుస్తున్నాడు అనేసరికి.. రికార్డులు బద్దలే అనుకున్నారు ఫ్యాన్స్‌, ప్రేక్షకులు. ఎందుకంటే అలాంటి కాంబినేషన్‌ మరి. అయితే ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. కారణాలేమైనా సినిమా అయితే ఎప్పుడు స్టార్ట్‌ అయ్యేది తెలియడం లేదు. దీని తర్వాత మహేష్‌.. రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కాబట్టి కనీసం ఓ మూడు నాలుగేళ్లు మహేష్‌ను తెర మీద చూడలేం. కాబట్టి త్రివిక్రమ్‌ సినిమాతో రికార్డులు కొట్టి.. ‘జక్కన్న గ్యాప్‌’లో వాటితో సరిపెట్టుకోవాలి అనుకున్నారు.

దీంతో త్రివిక్రమ్‌ సినిమాతో ఫుల్‌ మీల్స్‌ ఉండాల్సిందే అని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మహేష్‌ – త్రివిక్రమ్‌ను చూస్తుంటే ఇప్పుడే సినిమా మొదలుపెట్టేలా కనిపిచడం లేదు. త్రివిక్రమ్‌ ఓవైపు పవన్‌ సినిమా పనులు ఇన్‌డైరెక్ట్‌గా చూస్తున్నారని టాక్‌. మహేష్‌ ఏమో యాడ్స్‌ చేసుకుంటున్నారు. సినిమా మొదలు గురించి ఎక్కడా సమాచారం లేదు. అయితే రిలీజ్‌ డేట్‌ మాత్రం నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న వచ్చేస్తారట.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus