Mahesh Babu, Balakrishna: అఖండ సందడిపై మహేష్ బాబు ఫుల్ హ్యాపీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు ఇలాంటి సినిమా చేసినా కూడా నచ్చితే వెంటనే వారి ప్రశంసలు అందిస్తాడు. అంతేకాకుండా సినిమాను కూడా ప్రత్యేకంగా వీక్షించే తనదైన శైలిలో పాజిటివ్ రివ్యూలు కూడా అందిస్తూ ఉంటాడు. నందమూరి బాలకృష్ణ సినిమా కూడా ఈరోజు విడుదల కావడంతో ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ చాలా పాజిటివ్ గ స్పందించాడు. అంతేకాకుండా తనదైన శైలిలో శుభాకాంక్షలు కూడా తెలిపాడు.నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం అఖండ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయ్యింది.

ఉదయం నుంచి సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోల తో హడావిడి మొదలయ్యింది. అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. ఇక సినిమా సందడి చూసిన మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాడు.అఖండ సినిమా స్టార్టింగ్ అద్బుతం. ఈ రిజల్ట్ చాలా సంతోషంగా ఉంది అని, నందమూరి బాలకృష్ణ గారికి అలాగే బోయపాటి శ్రీను కి చిత్ర యూనిట్ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.

అలాగే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రొడక్షన్ హౌస్ ద్వారకా క్రియేషన్స్ ను మహేష్ బాబు ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. ఇక సూపర్ స్టార్ అభిమానులు కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus