Mahesh Babu: జీతెలుగుతో 9 కోట్ల డీల్ కుదుర్చుకున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన తన సినిమా ఈవెంట్లకు మాత్రమే బయట సందడి చేస్తూ ఉంటారు అంతకుమించి ఈయన ఏ కార్యక్రమాలలోనూ పాల్గొనరు. ముఖ్యంగా బుల్లితెర కార్యక్రమాలకు మహేష్ బాబు చాలా దూరంగా ఉంటారని విషయం మనకు తెలిసిందే. అయితే జీ తెలుగులో ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ అనే షో కోసం మహేష్ బాబు ఏకంగా తన కూతురితో కలిసి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ క్రమంలోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది.

ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు సితార చేయి పట్టుకొని వేదిక పైకి రావడం అందరిని పెద్ద ఎత్తున సందడి చేసింది. అయితే ఇలా మహేష్ బాబు ఈ వేదికపై సందడి చేయడం వెనుక ఓ పెద్ద స్టోరీ ఉందనీ తెలుస్తోంది.సాధారణంగా మహేష్ బాబు సినిమాలతో పాటు మరోవైపు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు గతంలో జీ తెలుగు ఛానల్ కి ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇలా గతంలో రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని జీ తెలుగు ఛానల్ కు ప్రమోటర్గా ఉండటమే కాకుండా ఈ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు మరోసారి జీ తెలుగుతో కలిసి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.

ఇక మహేష్ బాబు మరోసారి జీ తెలుగు కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడంతో ఈయన ఏకంగా ఈసారి 9 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ తో పాటు ఇందులో ప్రసారమయ్యే కార్యక్రమాలను కూడా ఈయన ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే డాన్స్ ఇండియా డాన్స్ అనే షోలో ఈయన తన కూతురుతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ డాన్స్ సోలో సితార సర్కారు వారి పాట ప్రమోషన్ సాంగ్ పెన్నీ పాటలో డాన్స్ చేసి సందడి చేశారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus