టాలీవుడ్లో రీ రిలీజ్..ల హవా ‘పోకిరి’ తో (Pokiri) మొదలైంది. అంతకు ముందు కూడా పలు సినిమా రీ రిలీజ్..లు అయ్యాయి కానీ.. మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా 4K కి డిజిటలైజ్ చేసి ఆ సినిమాని రీ రిలీజ్ చేశారు మహేష్ టీం సభ్యులు. మహేష్ నెక్స్ట్ జనరేషన్ ఫ్యాన్స్ కి ఇది మంచి కిక్ ఇచ్చింది. ఆ తర్వాత చాలా మంది హీరోలు తమ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న సినిమాలని రీ రిలీజ్ చేసుకున్నారు.
కొన్ని మంచి పనుల కోసం కూడా ఈ రీ రిలీజ్ లు హెల్ప్ చేశాయి. ఉదాహరణకి చిన్న పిల్లల హార్ట్ సర్జరీల కోసం ‘పోకిరి’ ‘బిజినెస్మెన్’ (Businessman) వంటి రీ రిలీజ్ కలెక్షన్స్ ని ఉపయోగించారు. అలాగే ‘జనసేన’ పార్టీ అభివృద్ధి కోసం ‘ఆరెంజ్’ (Orange) రీ రిలీజ్ కలెక్షన్స్ ని ఉపయోగించారు నాగబాబు (Nagendra Babu) . అంతా బాగానే ఉంది కానీ.. ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు నాడు రీ రిలీజ్ చేయడానికి సరైన సినిమా దొరకట్లేదు మహేష్ టీంకి..! మొత్తానికి ‘మురారి’ (Murari) ‘ఖలేజా’ (Khaleja) చిత్రాలని 4K కి డిజిటలైజ్ చేయించారు.
కానీ అవి ఫ్యాన్స్ లో జోష్ నింపే రేంజ్లో ఉండవు అని కొంతమంది మహేష్ అభిమానులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ‘మురారి’ అనేది పక్కా ఫ్యామిలీ సినిమా. అందులోని క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా ఉంటుంది. సో అది మహేష్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ లో జోష్ నింపే సినిమా కాదు. ‘ఖలేజా’ కొంతవరకు ఓకే. కానీ దాన్ని ఎక్కువగా టీవీల్లో చాలా మంది చూసేశారు.
యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఆ సినిమాని రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారా? అంటే అనుమానమే. కరెక్ట్ గా గమనిస్తే మహేష్ పుట్టినరోజున రీ రిలీజ్ చేసిన ‘పోకిరి’ ‘బిజినెస్ మెన్’ పూరి (Puri Jagannadh) డైరెక్షన్లో వచ్చినవే. మళ్ళీ ఈ కాంబోలో సినిమా పడితేనే ఫ్యాన్స్ కి మంచి కిక్ వస్తుందేమో.