మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు పార్థు అనే టైటిల్ వినిపిస్తుండగా ఈ టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇతర స్టార్ హీరోలు సైతం షాకయ్యేలా ఉండటం గమనార్హం. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
వకీల్ సాబ్ సినిమాకు పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకున్నారు. ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ కు లాభాలు 15 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం 65 కోట్ల రూపాయలు పారితోషికంగా వచ్చింది. అయితే త్రివిక్రమ్ సినిమాకు మహేష్ బాబు లాభాల్లో వాటా తీసుకోవడం లేదని సమాచారం. గత సినిమాలకు లాభాల్లో వాటా తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం కరోనా వల్ల పరిస్థితులు మారిన నేపథ్యంలో డైరెక్ట్ రెమ్యునరేషన్ తీసుకోవడానికి నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.
చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో పోలిస్తే మహేష్ ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది, ఈ నెల 31వ తేదీన అధికారికంగా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.