టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ కు సంబంధించిన వార్తలు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు సెట్స్ లో ఉన్నా లేకున్నా, గ్యాప్ లేకుండా వర్క్ నడిపిస్తున్నారట.
ఈ సినిమా కోసం రాజమౌళి ప్లానింగ్ మామూలుగా లేదు. కేవలం హీరో డేట్స్ మీదే ఆధారపడకుండా, ఇతర భారీ క్యాస్టింగ్ తో షూటింగ్ కానిచ్చేస్తున్నారని టాక్. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల నుంచి టాప్ స్టార్స్ రీసెంట్ గా సెట్స్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. మహేష్ బాబు అందుబాటులో లేని సమయాల్లో కూడా మిగతా ఆర్టిస్టులతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ జక్కన్న ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృథా చేయడం లేదట. దీన్ని బట్టి సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా రిలీజ్ డేట్ మీద పడింది. షూటింగ్ దశలో ఉన్నప్పుడే రాజమౌళి రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేశారని ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం 2027 శ్రీరామ నవమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ఆ డేట్ ను టార్గెట్ గా పెట్టుకుని వర్క్ చేస్తున్నారని అర్థమవుతోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేనిదే రాజమౌళి అడుగు ముందుకు వేయరని మరోసారి రుజువైంది.
శ్రీరామ నవమిని ఎంచుకోవడం వెనుక జక్కన్న పెద్ద స్కెచ్ ఉందనే అనుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండగ. ఒక పాన్ ఇండియా, కాదు కాదు పాన్ వరల్డ్ సినిమాకు ఇంతకంటే మంచి రిలీజ్ విండో దొరకదు. సమ్మర్ హాలిడేస్ కూడా కలిసి వస్తాయి కాబట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించడానికి ఈ డేట్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆ పండగ సెంటిమెంట్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
