భారత్ లో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మరి కొందరు హీరోలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో ఒకరైన మహేష్ బాబు కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పనివాళ్లు ఉండటానికి మహేష్ ఇంట్లోనే ఏర్పాట్లు చేయడంతో పాటు బయటి నుంచి వచ్చే వస్తువులను శానిటైజ్ చేసిన తరువాతే ఇంట్లోకి అనుమతిస్తున్నట్టు సమాచారం. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గేవరకు మహేష్ బాబు పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులను కలవడానికి కూడా మహేష్ బాబు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇటీవల తన ఇంటికి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండటంతో మహేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ముఖ్యమైన వ్యక్తులతో మహేష్ ఫోన్ ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి మహేష్ సిద్ధపడటం లేదని సమాచారం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను మహేష్ 2022 సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించగా కరోనా వల్ల మహేష్ ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కే సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు.