ఆర్.కె. ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం `మహిళా కబడ్డి`. రచన స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవలే మూడవ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కోసం ఉగాది పండుగ పై ఒక ప్రత్యేక పాటను సంగీత దర్శకుడు బోలే షావళి సంగీత సారథ్యంలో రూపొందించడం జరిగింది. ఈ పాటను ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో `మా` అధ్యక్షుడు శివాజీరాజా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ…“ఆర్.కె.ఫిలింస్ అంటే నా సొంత బేనర్ లాంటిది. నా కెరీర్ ప్రారంభ దశలో ఈ బేనర్ లో నటించాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ పై చేసిన పాటను నేను లాంచ్ చేయడం చాలా ఆనందగా ఉంది. బోలే షావళి అద్భుతంగా రాసి, కంపోజ్ చేయగా వరం అనే నూతన గాయని ఎంతో వినసొంపుగా పాడింది. ఈ పాటతో ఉగాది పండుగ ముందే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ పాటలా సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతోందని“ అన్నారు.
దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“మా బేనర్ లో చాలా గ్యాప్ తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంలోని ఉగాది పండుగ పై వచ్చే ప్రత్యేక పాటను బోలే రాసి, కంపోజ్ చేయగా వరం అనే నూతన గాయని అద్భుతంగా ఆలపించింది. మహిళలు ఎందులో తక్కువ కాదనే కాన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక పల్లెటూరు అమ్మాయి భారతదేశం గర్వపడే స్థాయిలో కబడ్డీ ఛాంపియన్ గా ఎలా ఎదిగిందనేది మెయిన్ కథాంశం. రచన స్మిత్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. శివాజీ రాజాగారు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మా బేనర్ తొలి హీరో అయిన శివాజీ రాజాగారి చేతుల మీదుగా మా చిత్రంలోని తొలి పాట లాంచ్ చేయడం చాలా సంతోషం. అలాగే మా చిత్రంలో ఫేమస్ సింగర్ మంగిలి కూడా ఒక పాడ పాడారు. రాజ్ కిరణ్ కంపోజ్ చేసిన ఆ పాటను ఉగాది పండుగ తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
తెలుగు ఫిలిం చాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ….“ఉగాది పై చేసిన పాట యుగాది పండుగలా అద్భుతంగా ఉంది. యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు.
ఏడిద శ్రీరామ్ మాట్లడుతూ…“చిన్న చిత్రాలను ఆదరించే ప్రతాని రామకృష్ణ గౌడ్ చేస్తోన్న ప్రయత్నం ఫలించాలి. టైటిల్ లాగే పాట అద్భుతంగా ఉందని“అన్నారు.
సింగర్ వరం మాట్లాడుతూ…“ఈ చిత్రంలో ఒక మంచి పాటను పాడే అవకాశం కల్పించిన ప్రతాని రామకృష్ణగారికి, బోలే గారి నా ధన్యవాదాలు“ అన్నారు.
సంగీత దర్శకుడు బోలే షావళి మాట్లాడుతూ…“ఉగాది పండుగ పై పాట రాసి , కంపోజ్ చేసే అవకాశం కల్పించిన ప్రతాని గారికి నా ధన్యవాదాలు“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.