Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Focus » Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

  • June 15, 2025 / 02:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

తల్లి గొప్పతనం తెలుపుతూ చాలా సినిమాలు వచ్చాయి. ఫాదర్ ఎమోషన్ తో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ తండ్రి తన కొడుకు లేదా కూతురు పట్ల చూపించే ప్రేమలో ఉన్న నిజాయితీ ఎలా ఉంటుందో వివరిస్తూ.. చాలా తక్కువ సినిమాలు మాత్రమే వచ్చాయి. ఆ సినిమాలు ఏంటి? ఆ టిపికల్ ఫాదర్ రోల్స్ చేసిన నటులు ఎవరు? అనేది ఇప్పుడు ఓ లుక్కేద్దాం పదండి :

Father’s Day Special:

1) రఘువరన్ : ఎక్కువ సినిమాల్లో విలన్ గా కనిపించిన ‘సుస్వాగతం’ సినిమాలో సింగిల్ ఫాదర్ గా కనిపిస్తారు.ఈ సినిమాలో ఒక డాక్టర్ గానే కాకుండా తన ఒక్కగానొక్క కొడుక్కి పనిమనిషిగా, గైడ్ గా కూడా వ్యవహరిస్తాడు.

2) ఎల్.బి.శ్రీరామ్ : గోపీచంద్ హీరోగా పరిచయమవుతూ చేసిన ‘తొలివలపు’ సినిమా చాలా మందికి గుర్తుండకపోవచ్చు. ఇందులో తండ్రి పాత్రలో ఎల్.బి.శ్రీరామ్ నటించారు. ఓ పల్లెటూరి వ్యక్తిగా, అదీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తండ్రిగా ఇతని నటన మనసును హత్తుకుంటుంది. ఎక్కువగా కొడుకుని తిడుతూనే.. అటు తర్వాత ప్రేమను చూపించే తీరు బాగుంటుంది.

3) కోటా శ్రీనివాసరావు : ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన కోటా… ‘ఇడియట్’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాల్లో చేసిన తండ్రి పాత్రలు కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సినిమాలో అయితే ఆయన నటనకి హ్యాట్సాఫ్ కొట్టకుండా ఉండలేము. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తండ్రి పాత్రలకు ఈ పాత్ర పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోతుంది.

4) ప్రకాష్ రాజ్ : విలక్షణ నటుడికి కేరాఫ్ అడ్రస్ అయిన ప్రకాష్ రాజ్ చేయని తండ్రి పాత్ర లేదు. వీటిలో ‘నువ్వే నువ్వే’ ‘ఆకాశమంత’ ‘బొమ్మరిల్లు’ సినిమాల్లో ఈయన పోషించిన తండ్రి పాత్రలు స్పెషల్ గా ఉంటాయి. ‘నువ్వే నువ్వే’ ‘ఆకాశమంత’ సినిమాల్లో కూతురు పట్ల చూపించే ప్రేమలో సెల్ఫిష్ నెస్ ఉంటుంది, పొసిసివ్ నెస్ ఉంటుంది అలాగే అతి జాగ్రత్త కూడా ఉంటుంది. ఇక ‘బొమ్మరిల్లు’ సినిమాలో తన కొడుక్కి అన్నీ తానే అయి నడిపించాలి.. అనుకునే టైంలో తెలియకుండా అతని ఇండివిడ్యువాలిటీని ఆక్రమించే పాత్రలో ఒదిగిపోయారు ప్రకాష్ రాజ్.

5) ముఖేష్ రుషి : ఈయన విలన్ గా ఎన్నో పాత్రలు చేసి ఉండొచ్చు. కానీ ‘ఒక్కడు’ సినిమాలో చేసిన తండ్రి పాత్ర మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. విలన్ నుండి తన కొడుకుని, అతని భవిష్యత్తుని కాపాడుకోవడానికి తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో ఈ సినిమాలో ముఖేష్ రుషి పాత్రతో బాగా చూపించారు.

6) చలపతిరావు : నితిన్ – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ సినిమాలో తన కొడుకుని ఫస్ట్ సీన్ నుండి తిడుతూనే ఉంటాడు తండ్రి(చలపతిరావు ). కానీ అతని కొడుక్కి కష్టం వచ్చినప్పుడు తన కోపాన్ని పక్కన పెట్టేసి అండగా నిలబడతాడు. తండ్రి ఇలా ఉంటే కొడుక్కి కొండంత బలం వస్తుంది అన్నట్టు ఈ పాత్రతో దర్శకుడు వినాయక్ బాగా చెప్పాడు.

7) తణికెళ్ళభరణి : సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి కొన్ని వందల సినిమాల్లో తండ్రి పాత్రలు చేశారు. వీటిలో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన వాటి గురించి చెప్పుకోవాలి అంటే ‘వెంకీ’ ‘ఆనందం’ ‘జులాయి’ సినిమాల్లో ఆయన చేసిన తండ్రి పాత్రలే అని చెప్పాలి. ఈ సినిమాల్లో హీరోలను ఆయన తిట్టే తీరు కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది.

8) ఆహుతి ప్రసాద్ : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఆహుతి ప్రసాద్ పాత్రని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో ఆయన కూతురి పట్ల చూపించే కేరింగ్.. తర్వాత ఆమె ప్రేమలో పడినప్పుడు చూపించే కఠినత్వం.., చివరికి ఆయన రియలైజేషన్ చాలా నాచురల్ గా ఉంటుంది.

9) ఎం.ఎస్.నారాయణ : కొడుకు తప్పిపోయాడో… లేక ఏమైనా అయిపోయాడో తెలియని తండ్రి.. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి తాగుడుకు బానిసైపోవడం కొన్నేళ్ల తర్వాత కొడుకు ఎదురొస్తే పసిపిల్లాడిలా మారిపోయి ఏడ్చేయడం.. వంటి నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ‘బుజ్జిగాడు’ సినిమాలో ఎం.ఎస్.నారాయణ పోషించిన పాత్రలో మనం చూడొచ్చు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారు అనే చెప్పాలి.

9) బోమన్ ఇరానీ : కూతురు తనకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అందుకు కూతురు చచ్చింది అని ఆవేశంలో దారుణాలు చేసే తండ్రులకు ఈ పాత్ర చాలా లెసన్ నేర్పుతుంది. తర్వాత చివరి రోజుల్లో తన కూతురు ఆమె ఫ్యామిలీ కావాలి అని ఆశపడే వ్యక్తిగా బోమన్ ఇరానీ చాలా చక్కగా నటించారు.

10) దేవీ ప్రసాద్ : ‘నీది నాది ఒకే కథ’ సినిమాలో దేవి ప్రసాద్ పోషించిన తండ్రి పాత్ర కూడా చాలా నాచురల్ గా ఉంటుంది. ఇలాంటి పాత్రని వేరే తెలుగు సినిమాలో చూసి ఉండరు.

11) కాశీ విశ్వనాథ్ : నిఖిల్ నటించిన ‘కలవర్ కింగ్’ లో కాశీ విశ్వనాథ్ పోషించిన తండ్రి పాత్ర కూడా రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కొడుకు అప్పుల్లో కూరుకుపోయాడు… అందుకు నెత్తి, నోరు కొట్టుకున్నప్పటికీ.. ఒక స్టేజ్ వచ్చేసరికి తన కొడుకు కంటే ఏదీ ఎక్కువ కాదు అని భావించే తండ్రి పాత్ర ఇది. ఈ పాత్రకి కాశీ విశ్వనాథ్ బాగా సెట్ అయ్యారు.

12) మురళీ శర్మ : కూతురికి త్వరగా పెళ్లి చేసేయాలి అని తొందరలో… ఆమె మనసులో ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది తెలుసుకోకుండా.. పెళ్లి చేసేసి, ఒకవేళ తర్వాత ఆమె భర్తతో సంతోషంగా జీవించడం లేదేమో అనే అనుమానంతో.. ఆ తండ్రి ఎంత కంగారు పడతాడు? చివరికి ఆమెకు నచ్చిన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతలా తగ్గాడు? అనే విషయాలను ‘నిన్ను కోరి’ సినిమాలో మురళీ శర్మ పాత్రతో బాగా చెప్పారు.

13) సర్వధామన్ డి బెనర్జీ : కొడుకు స్కాములు చేసి డబ్బులు సంపాదించాడు. కానీ మనశ్శాంతిని కోల్పోయాడు? ఇది గమనించిన తండ్రి తన కొడుక్కి ఎలా అండగా నిలబడ్డాడు? ఎలా తన కొడుకుని కాపాడుకున్నాడు అనేది ‘లక్కీ భాస్కర్’ లో హీరో తండ్రిగా చేసిన సర్వధామన్ డి బెనర్జీని పాత్రతో చాలా చక్కగా చూపించారు. ఈ పాత్రతో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.

14) చంద్రమోహన్ : కొడుకు ఆకతాయిగా తిరిగే రోజుల్లో అతన్ని తిట్టి, కొట్టి కంట్రోల్లో పెట్టాలని భావించే తండ్రి.. తర్వాత అతను ఉద్యోగస్తుడు అయినప్పుడు చూపించే ఎమోషన్ ఎంత నేచురల్ గా ఉంటుందో ‘7/జి బృందావన కాలనీ’ సినిమాలో చంద్రమోహన్ పాత్రతో చూపించారు. క్లైమాక్స్ లో అతనికి అండగా నిలబడే టైంలో కూడా ప్రేక్షకులను ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది ఈ పాత్ర.

15) సముద్రఖని : చెడు మార్గంలో వెళ్తున్న కొడుకుని కంట్రోల్లో పెట్టడానికి ఓ తండ్రి ఎంత వరకు వెళ్ళాడు? అనేది ‘రామం రాఘవం’ సినిమాలో సముద్రఖని పాత్రతో చాలా చక్కగా చూపించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Father's Day Special

Also Read

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

related news

trending news

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

9 hours ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

12 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

13 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

13 hours ago
Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

14 hours ago

latest news

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

18 hours ago
Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

18 hours ago
‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

19 hours ago
Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

19 hours ago
రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version