ఎన్నో ఆశలతో, అంచనాలతో వచ్చి.. ఆ దిశగా ఫలితం అందుకుంటుంది అనుకుంటుండగా అనూహ్యంగా వెనుకబడిపోయిన సినిమా ‘మనమే’ (Manamey) . శర్వానంద్ (Sharwanand) , కృతి శెట్టి (Krithi Shetty) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) తెరకెక్కించారు. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేస్తారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో వారంలోనే ఈ సినిమా వచ్చేస్తుంది. శర్వానంద్ నుండి చాలా రోజుల తర్వాత వచ్చిన చిత్రం ‘మనమే’. దీంతో ఈ ఫలితం ఆసక్తికరంగా మారింది.
అలాగే ‘ఉప్పెన’ (Uppena) సినిమా తర్వాత సరైన విజయం దొరక్క ఇరుకున పడ్డ కృతికి కూడా ఈ సినిమా ఫలితం ఇంట్రెస్టింగే. ఫైనల్‌గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు కూడా ఇదే పరిస్థితి. ఇంతటి అత్యవసర పరిస్థితిలో జూన్7న వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు జులైన 12న ఓటీటీలోకి వస్తోంది అంటున్నారు. సినిమా కథ విషయానికొస్తే.. ఎమోషన్స్, బాధ్యతలు లేని విక్రమ్ (శర్వానంద్) లండన్‌లో తనకు నచ్చినట్టు తిరుగుతూ, అమ్మాయిల వెంట పడుతూ ప్లే బాయ్.
విక్రమ్ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), శాంతి (మౌనికా రెడ్డి) దంపతులు ఇండియా వెళతారు. ఇక్కడ ప్రమాదంలో ఇద్దరూ మరణించడంతో కుమారుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ఒంటరి అవుతాడు. దీంతో పిల్లాడి బాధ్యతను సుభద్ర (కృతి శెట్టి) కలసి చూడాలనుకుంటుంది. వివిధ కారణాల వల్ల విక్రమ్‌తో కలసి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు తెలిసిన సుభద్ర ఒకవైపు..
అసలు రిలేషన్ షిప్ అంటే పడని విక్రమ్ మరోవైపు.. ఇద్దరి మధ్యలో పిల్లాడు.. ఈ ట్రయాంగిల్ కథనుసినిమాలో చూడొచ్చు. భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు కలిశారా? కలిస్తే ఎలా కలిశారు? బిడ్డ పరిస్థితి ఏంటి? వారి జీవిత ప్రయాణం ఎలా సాగింది అనేదే సినిమా కథ. ఓటీటీలో ఈ ఎమోషన్ డ్రామా ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.