Manchu Manoj: మీరు బ్రతికి మమ్మల్ని బ్రతకనివ్వండి!

మంచు మనోజ్ విష్ణు మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరు గొడవ పడినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది.వీరి మధ్య గొడవలు చోటు చేసుకోవడానికి సరైన కారణం ఏంటో తెలియదు కానీ ఈ విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక ఈ గొడవ తర్వాత మంచు కుటుంబానికి సంబంధించిన వారందరూ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఇది పెద్ద గొడవేమి కాదు అంటూ కామెంట్లు చేయగా, మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక విష్ణు సైతం మనోజ్ (Manchu Manoj) చిన్నవాడు ఆవేశంలో ఏదో షేర్ చేశారు. దీనిని ఇష్యూ చేయకండి అంటూ విష్ణు కూడా ఈ వీడియో పై స్పందించారు. ఇకపోతే తాజాగా విష్ణుతో గొడవ తర్వాత మొదటిసారి మనోజ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్ళముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండటం కన్నా పోరాడి ప్రాణాలు విడవడం మంచిది అంటూ ఈయన ఒక పోస్ట్ షేర్ చేశారు.

అనంతరం మరొక పోస్ట్ షేర్ చేస్తూ క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అంటూ మరొక కొటేషన్ షేర్ చేశారు. ఇకపోతే మరొక కొటేషన్ షేర్ చేస్తూ మీరు బ్రతకండి మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ దండం పెడుతున్నటువంటి ఎమోజిని షేర్ చేశారు. ఇలా ఈయన వరుసగా పోస్టులు షేర్ చేయడంతో ఈ పోస్టులపై నేటిజన్స్ స్పందిస్తూ అన్న విష్ణు అన్నతో మరోసారి ఏమైనా గొడవపడ్డారా అంటూ కామెంట్లు చేయగా…

కుటుంబం చాలా విలువైనది మీ మధ్య ఉన్న గొడవలు తొందరగా సర్దుమనగాలి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే మనోజ్ అన్న మీరు ఏంటో మాకు తెలుసు మీకు మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus