Manchu Vishnu: మంచు విష్ణుకి గాయాలు..అయినా థాంక్స్ చెబుతూ పోస్ట్..!

మంచు విష్ణు నటిస్తున్న ‘జిన్నా’ సినిమా షూటింగ్లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కాలికి గాయం అయ్యింది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన కాలికి గాయమైన ఫోటోని మంచు విష్ణు షేర్ చేస్తూ.. ముందుగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు థాంక్స్ చెప్పాడు. ఎందుకంటే తను డాన్స్ చేస్తూ ఇలా గాయపడతాడని కలలో కూడా ఊహించలేదట. చివర్లో ‘#jinna’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు.

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అంటే చాలా కష్టమైన స్టెప్పులు వేయిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఎటువంటి హీరోతో అయినా అద్భుతంగా డాన్స్ చేయించగలడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్న మంచు విష్ణు… ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనా రెడీ’ ‘ఆడో రకం ఈడో రకం’ వంటి హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త హీరోలు ఎక్కువవడంతో మంచు విష్ణు పోటీలో నిలబడలేకపోతున్నాడు.

అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు కానీ అవి హిట్టు గీత దాటడం లేదు. ఈ మధ్యనే ‘మా’ కి ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు మరోపక్క ‘జిన్నా’ అనే చిత్రం షూటింగ్ ను కూడా శరవేగంగా ఫినిష్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్రం నుండి గ్లింప్స్ ను విడుదల చేశారు. పాయల్ రాజ్‌ పుత్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus