ప్రముఖ గాయని వాణీ జయరాం చెన్నైలోని తన స్వగృహంలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి దాదాపు 14 భాషలలో సుమారు పదివేలకు పైగా పాటలను పాడినటువంటి వాణి జయరాం మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ప్రముఖ డైరెక్టర్ విశ్వనాధ్ గారి మరణ వార్త నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ కోలుకోక ముందే వాణి జయరాం మరణించారు. అయితే ఈమె మరణం పై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈమెది సహజ మరణం కాదని ఈమెపై కుట్ర జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గాయని వాణి జయరాం శరీరంపై గాయాలు ఉండడంతో ఈమె మరణం పై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరామ్ పనిమనిషి కూడా తన మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణి జయరాం మరణించే ముందు తన గదిలో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయని తన పనిమనిషి తెలియజేశారు. అయితే తాను కిటికీ తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఆమె కింద పడిపోయి ఉన్నారని
ఈ విషయాన్ని తన బంధువులకు తెలియజేసి వారు వచ్చిన తర్వాత ఆమె తలుపులు బద్దలు కొట్టి తనను బయటకు తీసుకు వచ్చినట్లు పనిమనిషి తెలియజేశారు. దీంతో పోలీసులు ఈమె మరణం పై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వాణి జయరాం ముఖంపై మాత్రమే కాకుండా శరీరంపై కూడా పలుచోట్ల గాయాలు ఉండడంతో తనపై హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే వాణీ జయరాం మరణాన్ని అనుమానాస్పద మరణంగా భావించిన పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇలా గాయనిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఇలాంటి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో సెలబ్రిటీలు ఈమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.