Bhanu Sree: ప్రేమించిన వ్యక్తిని మనువాడుబోతున్న యాంకర్ భాను శ్రీ.. వైరల్ అవుతున్న న్యూస్ ?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలు ఎంతో మంది సెలెబ్రిటీలు వారు ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తూ వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర నటులు వెండితెర నటులు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగా తాజాగా మరొక నటి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు బుల్లితెర నటి భాను శ్రీ. ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు బుల్లితెర సీరియల్స్ లోను అలాగే వెండి తెరపై పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

ఇలా వెండితెరపై బుల్లితెరపై నటించినప్పటికీ ఈమెకు రాని గుర్తింపు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా తనదైన శైలిలో ఆట ఆడుతూ అందరిని మెప్పించిన ఈమెకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం వరుస బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న భాను శ్రీ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.త్వరలోనే భాను శ్రీ పెళ్లి చేసుకోబోతుందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈమె పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు అని పెద్ద ఎత్తున అందరూ ఆరా తీస్తున్నారు.అయితే భాను శ్రీ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని ఈమె గురించి పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా భాను శ్రీ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాను శ్రీ ప్రస్తుతం తాను కెరియర్లో ఇలా ఉండడానికి తన ఫ్రెండే కారణమని తన జీవితంలో తనని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కామెంట్ చేశారు. అయితే ఆ వ్యక్తినే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలంటే ఈ విషయంపై భాను శ్రీ స్పందించాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus