Matka Trailer Review: మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయ్!
- November 2, 2024 / 01:46 PM ISTByFilmy Focus
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మట్కా’ (Matka) . మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) , సత్యం రాజేష్ (Satyam Rajesh) , శత్రు, నోరా ఫతేహి (Nora Fatehi).. వంటి వాళ్ళు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్.. ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సినిమాకి మంచి బజ్ ఏర్పడేలా చేసింది. తాజాగా ట్రైలర్ కూడా బయటకు వచ్చింది. 2 నిమిషాల 49 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్..
Matka Trailer Review

‘సర్కస్ లో బఫూన్లని చూసి జనమంతా నవ్వుతారు, చప్పట్లు కొడతారు, కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని, పులుల్ని సింహాల్ని ఆడించేవాడు ఒకడుంటాడు, అలాంటోడే వీడు. రింగ్ మాస్టర్..’ అనే డైలాగ్ తో మొదలైంది. వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్..ను తెలుపుతూ ఈ డైలాగ్ ఉంది. ఆ తర్వాత వాసు అనే కూలీగా ఎంట్రీ ఇచ్చిన హీరో.. తర్వాత జైలుకెళ్లడం ఆ తర్వాత ‘మట్కా’ కింగ్ గా ఎదగడం చూపించారు. వరుణ్ తేజ్ షేడ్స్ బాగున్నాయి. డైలాగ్స్ పలికే విధానంలో కూడా మంచి మాస్ కనిపించింది.
‘వ్యసనంలో పతనం ఉంటుంది’ అంటూ హీరోయిన్ మీనాక్షి చౌదరి పలికే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కి జీవి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అని చెప్పాలి.’నీలాంటి మంచోళ్ళు వల్లే టైంకి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి.. కానీ నా లాంటి చెడ్డోళ్ళు వల్ల ఓ పది మంది కడుపులు నిండుతున్నాయి.. నేచర్ బ్యాలెన్స్’ అంటూ చివర్లో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ కూడా మంచి హై ఇస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :












