మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ఈయన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెండు రోజుల ముందు నుంచే మెగా అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగా అభిమానులు నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో భాగంగా నాగబాబు (Nagababu) ముఖ్యఅతిథిగా పాల్గొని రాంచరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నాగబాబు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ…. మా ఇంట్లో ఐదుగురు బ్రదర్స్ సిస్టర్స్ కు రామ్ చరణ్ మొదటి అబ్బాయి.చిరంజీవి అన్నయ్యకు రాంచరణ్ కొడుకు అయినప్పటికీ మాకు మా చెల్లెళ్లకు కూడా రామ్ చరణ్ ను సొంత కొడుకు లాగే భావిస్తాము.
ఇక మా అందరికీ అన్నయ్య చిరంజీవి గారు ఎలా స్ఫూర్తినో మా పిల్లలకు మా చెల్లెల పిల్లలకు రామ్ చరణ్ అలా స్ఫూర్తిగా ఉన్నారని తెలిపారు.వారికి ఏ సమస్య వచ్చినా ముందుగా రామ్ చరణ్ వద్దకు వెళ్లి తన సలహా సూచనలు తీసుకుంటారని తెలిపారు. ఇక రామ్ చరణ్ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని కూడా తెలియజేస్తూ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారని నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు.ఇప్పుడు రామ్ చరణ్ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాడు.
కానీ ఒకప్పుడు తనకి చాలా కోపం ఆవేశం ఉండేదని, ఈ విషయాలు మాత్రం రామ్ చరణ్ లో తనకు అస్సలు నచ్చేవి కాదు అంటూ నాగబాబు తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం తన పూర్తిగా మారిపోయారని, ఏ విషయమైనా చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారని రామ్ చరణ్ గురించి నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.