మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవ ఇంకా ఇంకా పెరుగుతుందిగా..!

‘ఏం పీకలేరు బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇది ఇంతలా ట్రెండ్ అవ్వడానికి ఒక్క అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కారణం అనడానికి లేదు. యాంటీ మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి చేస్తున్న రచ్చ. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ‘సరైనోడు’ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ను అభిమానులు అడిగితే.. ‘చెప్పను బ్రదర్’ అంటూ ఓ డైలాగ్ వేశాడు.

దీనికి పవన్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ను భారీగా ట్రోల్ చేశారు. అప్పటి నుండీ కొందరు పవన్ ఫ్యాన్స్…. అల్లు అర్జున్ ను మెగా హీరోగా చూడమని చేసిన కామెంట్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ విషయం పై అల్లు అర్జున్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు కూడా. కొంతమంది పవన్ అభిమానుల వల్లే తను అలా మాట్లాడాను అంటూ తన మనసులో ఉన్నది బయటపెట్టాడు. అతని మాటల్లో తప్పేమి లేదని మద్దతు పలికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

అయితే ‘ఏం పీకలేరు బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ ఇంత హాట్ టాపిక్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. రాజకీయాల పరంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ’ కి ఎలా అండగా నిలబడాలి.. ఏ రకంగా దానిని ముందుకు తీసుకెళ్లాలి అనే పరోక్ష అంశం పైనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ మీటింగ్లో భాగంగా వేసిన ఫ్లెక్సీలలో అల్లు అర్జున్ ఫోటో లేదా పేరు వంటిది కబడలేదు.

అంతే అల్లు అర్జున్ ను మెగా హీరోగా కన్సిడర్ చేయడం లేదు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేశారు. నిజానికి ఈ వేడుకకి అల్లు అర్జున్ అభిమానులు ఆహ్వానించబడలేదు. ‘ప్రజారాజ్యం’ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో అల్లు అర్జున్.. పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఆ రోజులను కూడా మెగా ఫ్యామిలీ మర్చిపోయింది అంటూ అల్లు అర్జున్ అభిమానులు చెలరేగిపోతున్నారు. వారికి ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానులు కూడా అండగా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని టర్నులు తీసుకుంటుందో చూడాలి..!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.