Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మెగా హీరో స్వారీ చేస్తే విక్టరీ గ్యారంటీ

మెగా హీరో స్వారీ చేస్తే విక్టరీ గ్యారంటీ

  • July 16, 2016 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరో స్వారీ చేస్తే విక్టరీ గ్యారంటీ

గుర్రం పైన స్వారీ చేయడం .. అదో కళ. అందంగా స్వారీ చేయడం.. మెగాస్టార్ ఫ్యామిలీకి మాత్రమే తెలిసిన విద్య. మేలుజాతి గుర్రాలను మెరుగ్గా నడిపించగల నేర్పు వీరి సొంతం. పోరాట సన్నివేశాల్లో అశ్వాలపై వేగంగా స్వారీ చేస్తూ.. విజయ తీరాలను చేరుకున్నారు. ఈ హీరోల చేతిలో రాకెట్లా దూసుకెళ్లే ఈ గుర్రాలను చూస్తుంటే.. వీరి జోడిని బ్రహ్మ స్వర్గంలోనే రాసి పెట్టాడా ? అనిపిస్తుంటుంది.

చిరంజీవిChiranjeevi, Bruce Lee Movie

కొండవీటి దొంగ(1990) లో ముసుగు దొంగగా గుర్రం పైన మెగాస్టార్ చిరంజీవి నటించిన తీరుకు తెలుగు సినీ ప్రేక్షకులు జేజేలు పలికారు. గుర్రం పైనే ఫైట్, పాట చేసి ఔరా అనిపించారు. సూపర్ హిట్ అందుకున్నారు. అదే ఏడాది విడుదలయిన కొదమ సింహం లోనూ అచ్చమైన కౌ బాయ్ గా గుర్రం పై స్వారీ చేసి మెగాస్టార్ అనిపించుకున్నారు. మళ్లీ పాతికేళ్ల తర్వాత కూడా చిరు బ్రూస్లీ సినిమాలో తన స్టయిల్లో హార్స్ రైడింగ్ చూపించారు.

మగధీరRam Charan, Magadheera

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను కాల భైరవగా పరిచయం చేసిన చిత్రం మగధీర. రెండో చిత్రంలోనే చెర్రీ హార్స్ రైడింగ్ చేసి అలరించారు. ఈ చిత్రంలో అశ్వంతో కలిసి కాల భైరవ చేసిన పోరాటాలు, సాహసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హర్ష పాత్రలో కూడా రామ్ చరణ్ గుర్రాన్ని నేటి సిటీ రోడ్లపై చాకచక్యంగా నడిపి శెభాష్ అనిపించుకున్నారు. మెగాస్టార్ కి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.

పవన్ కళ్యాణ్Pawan Kalyan, Gabbarsingh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో బైక్, కార్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆయన తొలిసారి పూర్తి స్థాయిలో గుర్రంస్వారీ చేసిన సినిమా గబ్బర్ సింగ్. ఇందులో హీరో ఇంటర్డక్షన్ హార్స్ పైనే ఉంటుంది. హార్స్ కి పవర్ తోడయ్యేసరికి ఆ చిత్రం బంపర్ హిట్ గా నిలిచింది. అదే సెంటిమెంట్ తో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ గుర్రంతో కలిసి తెరపైన తమాషా చేశారు.

అల్లు అర్జున్Allu Arjun, Rudramadevi

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ గుర్రం పై ఎక్కి స్వారీ చేయగానే అవార్డులు పరిగెత్తుకు వచ్చాయి. దీంతో మెగా ఫ్యామిలీకి అశ్వం కలిసి వచ్చే కాంబినేషన్ గా మరోసారి నిరూపణ అయింది. రుద్రమదేవి చిత్రం లో గోన గన్నా రెడ్డి పాత్రలో బన్నీ గుర్రం పై వస్తుంటే చప్పట్ల వర్షం కురిసింది. అశ్వం పై హుందాగా కూర్చొని డైలాగులు చెబుతుంటే అభిమానులకు కనుల పండువగా అనిపించింది. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించినా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు.

సాయి ధరమ్ తేజ్Sai Dharam Tej, Thikka

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పోలికలతో కనిపిస్తూ.. ఉత్సాహంగా నటిస్తూ దూసుకుపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం తిక్క షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఆ చిత్రం పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ తెల్ల గుర్రంపై ఉన్న స్టిల్ సినిమాపై అంచనాలను పెంచింది. మెగా హీరోలకు కలిసి వచ్చిన హార్స్ సెంటిమెంట్ ఇతనికి కూడా వర్కౌట్ అవుతుందని సినీ పండితులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Gabbarsingh
  • #Gonaganna reddy
  • #Magadheera
  • #pawan kalyan

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

7 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

8 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

9 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

11 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

12 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

14 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version