2022వ సంవత్సరం ‘మెగా నామ సంవత్సరం’ అంటూ సోషల్ మీడియాలో మెగాభిమానులు సందడి చేసిన సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు 2022 బాగా కలిసొచ్చింది.. కేవలం సినిమాల పరంగానే కాదు.. పబ్లిక్‌గానూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు వారు..ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికెప్పుడూ ఆసక్తి చూపిస్తుంటాడు. తన జనరేషన్ హీరోల్లో ఫస్ట్ బాలీవుడ్ సినిమా చేసింది చరణే కావడం విశేషం.. ‘జంజీర్’ (తెలుగులో తుఫాన్) తో దశాబ్దం క్రితమే హిందీలో మూవీ చేశాడు. ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లూరి సీతా రామ రాజుగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు చెర్రీ.. ఇంట్రడక్షన్ సీన్, క్లైమాక్స్‌లో అల్లూరి అవతారంలో కనిపించే సన్నివేశాలు బెస్ట్ సీన్స్‌గా మిగిలిపోతాయి.
ట్రిపులార్‌తో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల తనకు ట్రూ లెజెండ్’ అవార్డ్ రావడంతో చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీటీవీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డుల ప్రదానోత్సవంలో చెర్రీ ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు చరణ్ మరో అరుదైన ఘనత సాధించాడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 12 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ టచ్ చేశాడు.
తనను 12 మిలియన్లు (కోటి 20 లక్షలు) మంది ఫాలో చేస్తుండగా.. చెర్రీ మాత్రం కేవలం 31ని మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అలాగే ఇప్పటివరకు 236 పోస్టులు చేశాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాడు. తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు మెగా పవర్ స్టార్..