మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసీఫర్’ రీమేక్, బాబీ డైరెక్షన్లో ఓ మూవీ, మెహర్ రమేష్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నారు. మెహర్ రమేష్ తో చేయబోయే మూవీ ‘వేదాలం’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. ఆల్రెడీ దర్శకుడు మెహర్ రమేష్ కొన్ని మాంటేజ్ షాట్లు కూడా చిత్రీకరించినట్టు వార్తలు వచ్చాయి..!
వచ్చే నెలలో ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే ‘ఈ మూవీకి మెహర్ పారితోషికం ఎంత ఉండొచ్చు?’ అనే డిస్కషన్లు చాలా రోజుల నుండీ జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం… ఈ ప్రాజెక్టుకి గాను మెహర్ రమేష్ కు పారితోషికం అంటూ ఏమీ లేదు. కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేవరకు నిర్మాత అనిల్ సుంకర..దర్శకుడు మెహర్ రమేష్ కు నెలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తూ వస్తున్నారట.
ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లి ఫినిష్ అయ్యే వరకు అలాగే ఇస్తారు. అంతేకాకుండా సినిమాకి లాభాలు వస్తే అందులో 20 నుండీ 30 శాతం వాటా మెహర్ కు ఇవ్వాలన్న మాట. దాదాపు 18 నెలల క్రితమే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యింది. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటివరకు మెహర్ రూ.90 లక్షల వరకు అందుకున్నాడన్న మాట. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అది రూ.1.5 కోట్లు దాటే అవకాశం ఉంది.పైగా లాభాల్లో వాటా కూడా..! మెహర్ రమేష్ లక్కీ అని ఈ విషయంతో మరోసారి ప్రూవ్ అయ్యింది.