నాని “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెహ్రీన్… తొలి చిత్రంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “మహానుభావుడు” లో మెప్పించింది. రాజా ది గ్రేట్ లో రవితేజ తో కలిసి అదరగొట్టింది. ఇక తిరుగుండదు అని అనుకొనేలోపే సాయి ధరమ్ తేజ్ తో చేసిన జవాన్ మూవీ బోల్తా కొట్టింది. గోపిచంద్ తో చేసిన పంతంతో నైనా హిట్ ట్రాక్ లోకి వద్దామనుకుంటే ఆ ఫలితం రివర్స్ అయింది. ఇలా వరుసగా ఫ్లాప్స్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఆమె బిజీగా ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎఫ్ 2లో వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది. సుధీర్ బాబు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోలీవుడ్ లో హిట్ అందుకోవాలని కల కలగానే అయిపోతోంది.
సినిమా హిట్ కాకపోయినా తన నటన అక్కడ దర్శకనిర్మాతల దృష్టిలో పడదామనుకుంటే అదికూడా కుదరడం లేదు. ఇదివరకు తమిళంలో సందీప్ కిషన్ తో ‘నెంజిల్ తునివిరుందాల్ (కేరాఫ్ సూర్య) చేసింది. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహ్రీన్ నటించిన సన్నివేశాలు చాలా వరకు ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి. ఈ విషయంలో ఆమె కు దర్శకుడు క్షమాపణలు చెప్పాడు. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నోటాలో నటించింది. ఈ చిత్రంతోనైనా అక్కడ బిజీ అవ్వాలన్న ఆమె కల తీరలేదు. ఈ చిత్రంలోఆమె విలేకరి పాత్రలో నటించింది. అసలే నిడివి తక్కువ పైగా అస్సలు గుర్తింపు లేని పాత్ర కావడంతో ఈ చిత్రం తో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. అందుకే ఏమిచేయాలా… అని మెహ్రీన్ తలపట్టుకుంటోంది.