ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు పది నెలలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.ఈ సినిమా పాతలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అనంతరం ఇతర దేశాలలో కూడా విడుదలవుతూ పెద్ద ఎత్తున ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వరించాయి.
ఈ సినిమా ఆస్కార్ భరిలో నిలవడమే కాకుండా దర్శకుడిగా రాజమౌళికి ఎన్నో అవార్డులు రివార్డులను తెచ్చిపెట్టింది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ నుంచి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా తాజాగా మరో అవార్డును అందుకుంది. అమెరికాకు చెందిన లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ ను దక్కించుకుంది. బెస్ట్ మ్యూజిక్ కేటగిరి 2022కి గాను ఎంఎం కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.
అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. ఈ విధంగా రెండు విభాగాలకు సంబంధించిన అవార్డులు RRR చిత్రానికి రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం మంచి టాప్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా పెద్ద ఎత్తున అవార్డులను అందుకుంటుంది
ఇక ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు విదేశాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో నాటు నాటు కొమరం భీముడో సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి.