సూపర్ స్టార్ రజనీకాంత్ కు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం రజనీకాంత్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ చంద్రబాబు, బాలకృష్ణలకు అనుకూలంగా మాట్లాడటం వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. వైసీపీ నేతలు రజనీకాంత్ ను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ కు అత్యంత సన్నిహితులలో మోహన్ బాబు ఒకరు.
సాధారణంగా రజనీకాంత్ పై ఎవరైనా విమర్శలు చేస్తే (Mohan Babu) మోహన్ బాబు స్పందించడం జరుగుతుంది. అయితే మోహన్ బాబు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విమర్శలు చేస్తే మోహన్ బాబుపై కూడా పొలిటికల్ విమర్శలు తప్పవు. ఈ రీజన్ వల్లే మోహన్ బాబు సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. వైరల్ అయిన ట్రోల్స్ రజనీకాంత్ దృష్టికి వెళ్లాయని ఈ ట్రోల్స్ ఆయనను కూడా ఎంతగానో బాధ పెట్టాయని సమాచారం.
రజనీకాంత్ సినిమాలు ఫ్లాప్ అయిన సమయంలో కూడా ఆయనపై ఈ స్థాయిలో ట్రోల్స్ రాలేదని తెలుస్తోంది. రజనీకాంత్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జైలర్ సినిమాతో రజనీకాంత్ కు మరో భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సాధారణంగా రజనీకాంత్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రజనీకాంత్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. రజనీకాంత్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ పారితోషికం 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండటం గమనార్హం. కెరీర్ పరంగా రజనీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.