కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి పెద్దబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. మోహన్ బాబు హీరోగా నటించిన ‘రగిలే గుండెలు’ చిత్రంలో బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసిన మంచు విష్ణు.. హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ‘విష్ణు’ మూవీతో అని చెప్పాలి. విష్ణుని హీరోగా లాంచ్ చేసే ముందు మోహన్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో విష్ణు హీరోగా ఎంట్రీ ఇవ్వాలి.
కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తర్వాత టాలీవుడ్ డైరెక్టర్లను కాదని ఆయన మలయాళం దర్శకుడు షాజీ కైలాస్ ను విష్ణు మొదటి సినిమాకి ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లెలు అయిన శిల్పా ఆనంద్ ను తీసుకున్నారు. సందీప్ చౌతా సంగీత దర్శకుడు. పలు బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఇస్మాయిల్ దర్బార్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.పరుచూరి బ్రదర్స్ రైటర్స్ గా పనిచేసారు.
నీతూ చంద్ర వంటి భామని ఓ కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. సినిమా నిండా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లే..! ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయ్యిందో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెడతారు. 2003 లో వచ్చిన ఈ మూవీకి.. ఆ రోజుల్లోనే రూ.28 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. ఇప్పటి లెక్కల ప్రకారం అయితే అది వందల కోట్ల పైమాటే అనమాట. టాలీవుడ్లో అప్పటివరకు ఏ హీరో లాంచింగ్ కు కూడా ఇంత బడ్జెట్ పెట్టి ఉండరు. అంత చేసి ఈ సినిమా హిట్ అయ్యిందా? అంటే లేదు.
బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టింది. అయితే మోహన్ బాబే ఈ సినిమాని రెంట్ల బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకోవడంతో బయ్యర్స్ కు పెద్దగా నష్టాలు రాలేదు. విష్ణు మొదటి సినిమాకి కె.రాఘవేంద్రరావు వంటి పెద్ద డైరెక్టర్ తగిలుంటే అతను కెరీర్ ఇప్పుడు మరోలా ఉండేదేమో. పోయి పోయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని షాజీ కైలాస్ ను ఎంపిక చేసుకున్నారు. అతను తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు హీరోయిజం చూపించలేక సినిమాని పడుకోబెట్టాడు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!