‘మాస్ జాతర’ సినిమా సెకండాఫ్ లో ఓ సీన్ ఉంటుంది. అందులో.. ”వాల్టర్ వైట్..’ ఎవడీడు?’ అని హీరో రవితేజ అడగ్గానే రాజేంద్రప్రసాద్ ‘నేనే’ అంటూ సమాధానం ఇస్తాడు. అందుకు రవితేజ ‘సొంత పేరు పెట్టుకునే దమ్ము లేదు కానీ..ట్విట్టర్లో వార్లు, వార్నింగ్లు, స్పేస్ లు,బూతులు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా సిక్ మైండెడ్, నెగిటివ్, జెలస్, హిప్పోక్రేట్స్, జాబ్ లెస్, బ్రెయిన్ లెస్, బావిలో కప్పల్స్, చీకట్లో మొరిగే కుక్కల్స్, అండ్ ఫ్రస్త్రేటేడ్ లైక్ యు’ అంటూ అతనిపై మండిపడతాడు.
వాస్తవానికి రాజేంద్ర ప్రసాద్ ని అడ్డుపెట్టుకుని రవితేజ.. ట్విట్టర్ జనాలకు, సోషల్ మీడియాలో ఉండే ట్రోలింగ్ బ్యాచ్ కి వేసిన సెటైర్ ఇది. రవితేజకి మాత్రమే కాదు నిర్మాత నాగవంశీ మైండ్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఆ విషయం పక్కన పెట్టేస్తే.. గతేడాది వచ్చిన రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో కూడా ‘పని పాటా లేని పకోడీ గాళ్ళకి.. ఇదే పని. భవిష్యత్తులో ఇలాంటి వాళ్లకి డబ్బులు కూడా ఇస్తారేమో’ అంటూ ఆ సినిమాలో కూడా సోషల్ మీడియా జనాలను టార్గెట్ చేసి ఓ స్ట్రాంగ్ కౌంటర్ వదిలాడు రవితేజ.

నాగవంశీలానే దర్శకుడు హరీష్ శంకర్ కి కూడా సోషల్ మీడియా జనాలపై అలాంటి అభిప్రాయం ఉంది. అందుకే ఆ డైలాగ్ పెట్టాడు. అయితే ఏ విషయాన్ని మైండ్ కి, మనసుకి తీసుకోను అని రవితేజ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ అలాంటి హీరోతో ఇలాంటి డైలాగులు ఎలా చెప్పిస్తున్నారు? రవితేజ మాత్రం ఎందుకు చెబుతున్నట్టు? అనేది అంతు చిక్కని ప్రశ్న.
