Devara Song Controversy: దేవర సాంగ్ వివాదం.. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ రియాక్షన్ ఇదే!
- August 7, 2024 / 02:24 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తున్న దేవర (Devara) సినిమా నుంచి విడుదలైన మెలోడీ సాంగ్ చుట్టమల్లే సినిమా కాపీ అంటూ పదుల సంఖ్యలో మీమ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మణికె మాగే హితే అనే సాంగ్ నుంచి ఈ సాంగ్ కాపీ చేశారని ఆరోపణలు వినిపించగా మణికె మాగే హితే మ్యూజిక్ డైరెక్టర్ చమత్ సంగీత్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
Devara

అనిరుధ్ (Anirudh Ravichander) వర్క్ ను నేను ఎంతో ఆరాధిస్తానని నా పాట అయిన మణికె మాగే హితే సాంగ్ ను స్పూర్తిగా తీసుకుని అనిరుధ్ సిమిలర్ గా ఉన్న సాంగ్ ను క్రియేట్ చేయడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని చమత్ సంగీత్ పేర్కొన్నారు. చమత్ సంగీత్ రియాక్ట్ అయిన తీరును మాత్రం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ కే సమస్య లేదు కాబట్టి ఈ సాంగ్ విషయంలో లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు.

మరోవైపు ఈ సాంగ్ కు లాంగ్ రన్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో హిట్టైన మరో సాంగ్ అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

దేవర సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దసరా పండుగ సెలవులను ఈ సినిమా కచ్చితంగా క్యాష్ చేసుకోనుంది. దేవర సినిమా పెద్దగా పోటీ లేకుండానే థియేటర్లలో విడుదల కానుంది. 2024 బిగ్గెస్ట్ హిట్ గా దేవర నిలుస్తుందేమో చూడాలి. బిజినెస్ పరంగా దేవర మూవీ మేకర్స్ కు భారీ స్థాయిలోనే లాభాలను అందిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
#Devara : #Chuttamalle Controversy!
Lankan Musician #ChamathSangeeth says he is happy to see his Song #ManikeMageHithe (allegedly) inspire #DevaraSecondSingle ft. #JrNTR & #JahnviKapoor!
This Number was already used in #ThankGod (Hindi) on #SiddharthMalhotra & #NoraFatehi. pic.twitter.com/slyyuJt3y8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 7, 2024
















