సంగీత దర్శకులు హీరోగా ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నించడం అనేది బాలసుబ్రమణ్యంతోనే మొదలైనప్పటికీ.. ఆర్పీ పట్నాయక్ తో ఆ సంస్కృతి మరింతగా పెరిగింది. ఆ తర్వాత ఆ పద్ధతిని జి.వి.ప్రకాష్, హిప్ హాప్ తమిళలు ఆ విధానాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు సిద్ధమవుతున్న మరో సంగీత దర్శకుడు గోపీ సుందర్. మలయాళ చిత్రసీమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన గోపీసుందర్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇక తాజాగా గోపీసుందర్ సంగీత సారధ్యంలో రూపొందిన “గీత గోవిందం” చిత్రంలోని “ఇంకేం ఇంకేం కావాలి” పాట అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా విశేషమైన క్రేజ్ తోపాటు.. హీరో అవ్వడానికి కావాల్సిన అన్నీ క్వాలిఫికేషన్స్ పుష్కలంగా ఉండడంతో త్వరలోనే “టోల్ గేట్” అనే సినిమాతో హీరోగా పరిచయమవ్వనున్నాడు.
హరికృష్ణన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా క్లాసీ హీరోగా గోపీసుందర్ ఇంట్రడ్యూస్ అవ్వనున్నాడు. మరి ఈ “టోల్ గేట్” అనంతరం గోపీసుందర్ హీరోగా మాత్రమే నటిస్తాడా అవుతాడా లేక హీరోగా సినిమాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గానూ కంటిన్యూ అవుతాడా అనేది తెలియాలి.