మంచు వారి ఇంట్లో గొడవలు వీధిలో పడటం, అల్లరి పాలవ్వడం జరుగుతుంది. మంచు మనోజ్ (Manchu Manoj) పై కొందరు దాడి చేయడం, ఆ తర్వాత అతను హాస్పిటల్ కి వెళ్లడం.. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. మొదట్లో ‘ఏమీ లేదు,అవన్నీ అసత్య ప్రచారాలు’ అంటూ కొట్టిపారేసిన మంచు మనోజ్, మంచు విష్ణు (Manchu Vishnu)..లు తర్వాత కొంత సమయం సైలెంట్ అయ్యారు. ఈ గ్యాప్లో మంచు లక్ష్మీ ఎంట్రీ ఇవ్వడంతో గొడవలు చల్లారినట్టే అని అంతా అనుకున్నారు.
Manchu Manoj
కానీ తర్వాత పరిస్థితి చేయి దాటిపోయింది అని భావించి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ వెంటనే మనోజ్ ..అతని తండ్రి మోహన్ బాబు (Mohan Babu), అన్న మంచు విష్ణులపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, సాయంత్రానికి మోహన్ బాబు … మంచు మనోజ్, మోనికా..ల పై కేసు పెట్టడం వంటి కలకలం సృష్టించాయి. తాజాగా మోహన్ బాబు పెట్టిన కేసుపై మనోజ్ స్పందించాడు.
మంచు మనోజ్ (Manchu Manoj) ఈ విషయంపై మాట్లాడుతూ.. “నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడింది లేదు.నేను, నా భార్య సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నాం.మాకు సంబంధించిన విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి అని నేను గుర్తించాను. ఈ క్రమంలో బాధితుల పక్షాన, వారికి మద్దతుగా నిలబడినందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టడాన్ని నేను తట్టుకోలేకపోయాను. అలాగే వాళ్ళ కుటుంబాల శ్రేయస్సు గురించి కూడా ఆలోచించాను. మా ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజీ మాయమైంది. అది మాయం చేసింది విష్ణు అనుచరులే. వాళ్ళే సిసి ఫుటేజ్ ను మాయం చేశారు” అంటూ చెప్పుకొచ్చారు.