ఇదివరకు హీరో అంటే రాముడు మంచి బాలుడు, చాలా మంచోడు అయితేనే హీరో అనే కాన్సెప్ట్ లో ఉండేవి పాత్రలు. కానీ రానురాను హీరో అంటే డెఫినిషన్ మారిపోయింది. వెధవలు కూడా హీరోలే అనే కాన్సెప్ట్ ను పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మొదలుపెడితే.. ఆ తర్వాత మిగతా దర్శకులు దాన్ని పెంచి పోషించారు. ఇక ఇప్పుడు రావణుడు లాంటోడే హీరో అయిపోయాడు. నెగిటివ్ రోల్స్ ను జనాలు ఎంజాయ్ చేస్తున్నారు కూడా. రీసెంట్ గా వచ్చిన “యానిమల్” (Animal) అందుకు నిదర్శనం.
Rajendra Prasad
అయితే.. ఈ జాబితాలో “పుష్ప”ను (Pushpa) కూడా యాడ్ చేసేసారు సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). ఇవాళ జరిగిన “హరికథ” అనే వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. “నిన్నగాక మొన్న చూసాం.. వాడెవడో చందనం దుంగల్ని దొంగతనం చేసే దొంగ.. వాడు హీరో, హీరోల్లో మానింగులు మారిపోయాయి” అన్నారు. ఇక్కడ రాజేంద్రప్రసాద్ ఏదో కావాలని అల్లు అర్జున్ ని హర్ట్ చేయడానికో లేక పుష్ప2 సినిమాని తక్కువ చేయడానికో ఏమీ టార్గెట్ చేసి మాట్లాడలేదు.
కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా తీసుకున్నారు. దాంతో ఈ మాటలు ఇప్పుడు వైరల్ అయిపోయాయి. అయితే.. అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన “జులాయి (Julayi) , సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) , అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo) ” చిత్రాల్లో కీలకపాత్ర పోషించింది రాజేంద్రప్రసాద్ అనే విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్.
బన్నీతో రాజేంద్రప్రసాద్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి స్నేహితుల్లా ఉంటారు వీరిద్దరూ. భవిష్యత్ లోనూ ఈ ఇద్దరు కలిసి వర్క్ చేయవచ్చు కూడా. అందువల్ల జనాలు ఈ మాటలని సీరియస్ తీసుకోకుండా ఉంటే బెటర్. ఇకపోతే.. “హరికథ” వెబ్ సిరీస్ డిసెంబర్ 13 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వనుంది.