యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అతని తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ రికార్డులన్నింటికీ రిపేరు చేయడంతో పూర్వవైభవం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తారక్ వేసే స్టెప్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. మాస్ మసాలా కథ ఎంచుకుంటారా? క్లాస్ స్టోరీ వైపు వెలుతారా? మళ్లీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తో వస్తారా ? అని అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ కి ఇప్పటికే అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్, లింగు స్వామి, ఒక్కంతు వంశీ తదితరులు కథలు చెప్పారు. అయితే ఆయన ఎవరికీ ఒకే చెప్పలేదు. ఫిల్మీ ఫోకస్ కి అందిన సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే సినిమా ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ‘ఇజం’కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్న డైరక్టర్..
ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించనున్నారు. ఎన్టీఆర్ కూడా అంతవరకు మౌనంగా ఉండనున్నారు. ఇజం ఫలితం బట్టి తారక్ నిర్ణయం ఉంటుందని, కళ్యాణ్ రామ్ చిత్రం హిట్ సాధిస్తే.. పూరి తో అడుగులు వేస్తారు.. లేదంటే ఆ ఛాన్స్ మరో దర్శకునికి వెళ్లే అవకాశం ఉందని టాక్.