ఈ ఇంటర్నెట్ యుగంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు మాత్రం పేట్రేగిపోయి సోషల్ మీడియా ఎకౌంట్ లు, వాట్సాప్ ఎకౌంట్లు, కుదిరితే ఫోన్లు కూడా హ్యాక్ చేస్తున్నారు. రీసెంట్ గా అలా సైబర్ దాడికి గురైన స్టార్ హీరో ఉపేంద్ర. ఆయన సతీమణి ప్రియాంక ఫోన్ ని ముందుగా కొందరు ఆన్లైన్ ఆర్డర్ పేరుతో హ్యాక్ చేశారట, ఆ తర్వాత ఆమె ఫోన్ ద్వారా ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ చేశారట. దాంతో ఏం చేయాలో తోచక ఉపేంద్ర ఓ వీడియో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన ఫోన్ హ్యాక్ అయ్యిందని, తన ఫోన్ నుంచి వచ్చే లింక్స్ ఎవరూ క్లిక్ చేయవద్దని, ముఖ్యంగా డబ్బులు అస్సలు ట్రాన్స్ఫర్ చేయొద్దని ఉపేంద్ర విజ్ఞప్తి చేశారు. మాములుగా హీరోయిన్లు ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ.. ఇలా ఒక స్టార్ హీరో ఈ తరహా సమస్య ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కావచ్చు. అసలు ఉపేంద్ర అంటేనే అందరికీ కాస్తంత భయం ఉంటుంది.
అలాంటిది ఆయన ఫోన్ హ్యాక్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ చేసిన వ్యక్తి ఎవరో అని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ఇకపోతే.. ఉపేంద్ర తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం “ఆంధ్రా కింగ్ తాలుకా” కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 28న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
రామ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఒక తెలుగు స్టార్ హీరోగా కనిపించనున్నాడు. ఆయన పార్ట్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందట. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.
Beware… pic.twitter.com/ftbQDFodTf
— Upendra (@nimmaupendra) September 15, 2025