టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers ), మరోసారి బాక్సాఫీస్‌ను ఊపే ప్లాన్‌లో ఉంది. ఈ బ్యానర్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలను కూడా హ్యాండిల్ చేస్తూ తన హవా చూపుతోంది. ఇప్పటికే పుష్ప 2 (Pushpa 2), వీరసింహారెడ్డి (Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) వంటి సినిమాలతో పెద్ద హిట్స్ అందుకున్న మైత్రి, ఇప్పుడు మరో డబుల్ ధమాకా ప్లాన్‌తో రెడీ అవుతోంది. అదే ఏప్రిల్ 10. ఈ రోజున మైత్రి బ్యానర్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఒకటి కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith Kumar) నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly), మరొకటి బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) నటిస్తున్న జాట్ (Jaat). రెండు సినిమాలు కూడా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్స్ కావడంతో, వీటిపై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అజిత్ కు రీసెంట్ గా వచ్చిన విడామయూర్చి (Vidaamuyarchi) సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఆయన ఫ్యాన్స్ అంతా గుడ్ బ్యాడ్ అగ్లీ మీదే ఆశలు పెట్టుకున్నారు.
అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ట్రేడ్ వర్గాల లెక్కలు ప్రకారం, పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే ఈ సినిమా ₹100 కోట్లకు పైగా వసూలు చేయనుందని అంచనా. ఇక జాట్ గురించి చెప్పాలంటే, సన్నీ డియోల్ సక్సెస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గదర్ 2తో (Gadar 2) బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న సన్నీ, ఇప్పుడు జాట్ సినిమాతో మరోసారి తన మాస్ ఇమేజ్‌ను ఆవిష్కరించబోతున్నాడు.
గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హిందీ బెల్ట్‌లో బిగ్ హిట్ అయితే, ప్రాఫిట్స్ లెక్క 150 కోట్లు దాటడం ఖాయం అని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. మొత్తం మీద, రెండు సినిమాలు క్లిక్ అయితే మైత్రి మూవీ మేకర్స్‌కు (Mythri Movie Makers ) 350 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాస్త పాజిటివ్ బజ్ క్రియేట్ అయినా కూడా డబుల్ జాక్ పాట్ తగిలినట్టే. మరి ఏప్రిల్ 10న మైత్రి ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.