Naga Chaitanya: కార్తీ గురించి నాగార్జున అలాగే చెప్తారా.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్!
- January 31, 2025 / 01:00 PM ISTByPhani Kumar
నాగార్జున (Nagarjuna) – కార్తీ (Karthi)…అనగానే అందరికీ ‘ఊపిరి’ (Oopiri) సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో వారి బాండింగ్ అందరినీ ఆకట్టుకుంది. ‘అన్నయ్యా.. అన్నయ్యా’ అంటూ కార్తీ… నాగార్జునని అనడం అనేది అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. వాళ్ళు నిజమైన అన్నదమ్ములే అనే ఫీలింగ్ కలిగించింది. వారి బ్రొమాన్స్ బాగా పండటం వల్లనే సినిమా సూపర్ హిట్ అయ్యింది అని చెప్పాలి. ఆ తర్వాత నుండి నాగార్జున, కార్తీ మరింతగా క్లోజ్ అయిపోయారు అని చెప్పాలి.
Naga Chaitanya

కార్తీ ‘సర్దార్’ (Sardar) సినిమాని కూడా తెలుగులో కార్తీ రిలీజ్ చేయడానికి కారణం అదే. ఇక వారి బాండింగ్ గురించి నాగ చైతన్య (Naga Chaitanya) మరోసారి గుర్తు చేశాడు. నిన్న చెన్నైలో జరిగిన ‘తండేల్’ (Thandel) ఈవెంట్ కి కార్తీ గెస్ట్ గా వెళ్ళాడు. నాగ చైతన్య మాట్లాడుతూ… “చెన్నైకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా మూలాలు చెన్నైతో ముడిపడి ఉన్నాయి.
నా సినిమా ‘తండేల్’ చెన్నైలో కూడా రిలీజ్ అవుతుండడం అనేది నాకు సంతోషంగా అనిపిస్తుంది. కార్తీ సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. నేను ఎప్పుడు చెన్నైకి వెళ్తున్నాను అని చెప్పినా.. మా నాన్న గారు(నాగార్జున) నాకు ఒక్కటే చెబుతుంటారు. ఏదైనా అవసరం ఉంటే చెప్పు.. ‘నేను కార్తీకి ఫోన్ చేస్తాను’ అని..! ‘కార్తీ మా ఫ్యామిలీ మెంబెర్’ అని నాన్న ఎక్కువగా చెబుతుంటారు.
అలాంటి కార్తీ ‘తండేల్’ ని ప్రమోట్ చేయడానికి రావడం నిజంగా సంతోషంగా ఉంది. అలాగే నన్ను చెన్నై మీడియాకి పరిచయం చేసింది దర్శకులు వెంకట్ ప్రభు గారు. ఆయన కూడా ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.
#Nagachaitanya Super Tamil Speech #Thandel Tamil Trailer Launch Event pic.twitter.com/DFIcyyZyYL
— Filmy Focus (@FilmyFocus) January 30, 2025

















