Naga Chaitanya: ఆ సిరీస్ తో చైతూ రిస్క్ చేస్తున్నారా?

దాదాపుగా నెల రోజుల క్రితం చైతన్య సమంత విడిపోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే సమంత చైతన్య ​విడిపోయిన తర్వాత వాళ్ల విడాకులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విడాకుల తర్వాత సమంత షూటింగ్ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో వెకేషన్ లకు ఎక్కువగా వెళుతూ సమంత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సమంత సినిమాలపరంగా బిజీ కావాలని ప్రయత్నిస్తూ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఒక్కో సినిమాకు సమంత మూడు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ తో సమంత సక్సెస్ సాధించగా నాగచైతన్య కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య కలిసి బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారు. చైతన్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సిరీస్ లో హర్రర్ కథాంశంలో నటిస్తుండగా ఇందులో చైతన్య విలన్ రోల్ ను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.

సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. చైతన్య కూడా ఈ సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. చైతన్య సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం. ఒక్కో సినిమాకు నాగచైతన్య 5 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాసినిమాకు నాగచైతన్యకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus