Naga Chaitanya , Sai Pallavi: ఆ కాంట్రోవర్సీలని స్కిప్ చేసిన ‘తండేల్’ జంట!
- November 6, 2024 / 11:12 AM ISTByFilmy Focus
ఈరోజు ‘తండేల్’ (Thandel) సినిమా ప్రెస్ మీట్ జరిగింది. రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. సంక్రాంతికి ‘తండేల్’ రిలీజ్ అవుతుంది అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే సోలో రిలీజ్ డేట్ కావాలని ఫిబ్రవరి 7 కి ఫిక్స్ చేసుకుంటున్నట్టు ఈరోజు అధికారికంగా వెల్లడించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ‘తండేల్’ సినిమా ప్రెస్ మీట్లో భాగంగా ‘క్యూ అండ్ ఏ’ కూడా ఉంటుందని వెల్లడించారు టీం మెంబర్స్.
Naga Chaitanya , Sai Pallavi:

దీంతో చాలా ఉత్సాహంగా మీడియా సభ్యులు వచ్చి కూర్చున్నారు. అయితే స్పీచ్..ల అనంతరం నాగ చైతన్య (Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) .. ‘క్యూ అండ్ ఎ’ ని స్కిప్ చేసి వెళ్లిపోయారు. ‘వాళ్ళని కావాలనే పంపించేశారా?’ అనే ప్రశ్న కూడా నిర్మాత అల్లు అరవింద్ కి ఎదురైంది. అందుకు ఆయన ‘అవును..’ అంటూ నవ్వు నవ్వి తెలివిగా మేనేజ్ చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి .. ‘క్యూ అండ్ ఎ’ ని స్కిప్ చేయడం వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి.

చైతన్య విషయానికి వస్తే.. ఈ మధ్యనే అతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. సమంతతో (Samantha) విడాకుల తర్వాత 3 ఏళ్ళు ఒంటరిగా ఉంటూ వచ్చిన చైతన్య.. ఇటీవల తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సో చైతన్య ‘క్యూ అండ్ ఎ’ లో ఉంటే ఆ టాపిక్ కి సంబంధించి ప్రశ్నలు ఎదురవుతాయి. మరోపక్క సాయి పల్లవిపై ఇటీవల బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. దాని గురించి ఆమెకు ప్రశ్నలు ఎదురవ్వచ్చు. అందుకే ఆమె కూడా ఎస్కేప్ అయినట్టు స్పష్టమవుతుంది.
‘క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ సాయి పల్లవి..#SaiPallavi తో డ్యాన్స్ చేయాలి అంటే ఎప్పుడూ చిన్న భయం ఉంటుంది: #NagaChaitanya pic.twitter.com/sFkzKWvqAC
— Filmy Focus (@FilmyFocus) November 5, 2024
#NagaChaitanya ఒకే ప్రోజెక్ట్ మీద ఇంత టైమ్ స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు: #SaiPallavi#Thandel #ChandooMondeti pic.twitter.com/YENzTxilnU
— Filmy Focus (@FilmyFocus) November 5, 2024














