నాగ చైతన్యని ‘జోష్’ చిత్రంతో హీరోగా లాంచ్ చేసింది నిర్మాత దిల్ రాజు. అయితే ఆ చిత్రంతో నాగ చైతన్య దక్కాల్సిన గ్రాండ్ వెల్కమ్ దక్కలేదు. అందుకే అతను మీడియం రేంజ్ హీరోల లిస్ట్ కే పరిమితమయ్యాడు. తర్వాత నుండీ తన సొంత ట్యాలెంట్ తో మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ… అదే సమయంలో నటుడిగా కూడా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. అయితే నాగ చైతన్య కి మంచి డెబ్యూ ఇవ్వలేకపోయానే అనే బాధ దిల్ రాజులో ఉందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అందుకే 10 ఏళ్ళ వరకు వెయిట్ చేసి ‘థాంక్యూ’ అనే సినిమాని చైతన్యతో చేస్తున్నారు దిల్ రాజు.ఈ మూవీతో చైతన్యకి పెద్ద హిట్ ఇవ్వాలని ఆయన పరితపిస్తున్నారు. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. కాకపోతే ‘థాంక్యూ’ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నట్టు నిన్నటి నుండీ వార్తలు వస్తున్నాయి. దాంతో నాగ చైతన్య ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఒమిక్రాన్ తీవ్రత పెరిగి మళ్ళీ థియేటర్లు మూతపడితే ఎలా? అనే ఉద్దేశంతో…
ముందుచూపుగా ఓటిటి సంస్థలతో దిల్ రాజు డిస్కషన్లు జరిపిన మాట నిజమేనట. కాకపోతే ఓటిటి సంస్థలు చెప్పిన రేటు దిల్ రాజుకి నచ్చలేదు. అందుకే ఆ ఆలోచనని విరమించుకున్నారని తెలుస్తుంది. అందుకే వెంటనే చిత్ర బృందం.. ‘థాంక్యూ’ డైరెక్ట్ గా ఓటిటిలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేసింది. షూటింగ్ పూర్తికావొచ్చింది.న్యూయర్ లేదా సంక్రాంతి టైంకి విడుదల తేదీని ప్రకటిస్తారని ఇన్సైడ్ టాక్.