విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా ఈరోజు అనగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే కొంతమంది కొన్ని కంప్లైంట్స్ కూడా చెబుతున్నారు. వాటిని నిర్మాత నాగవంశీ కూడా యాక్సెప్ట్ చేశారు. ‘సినిమాలో కొన్ని మైనస్సులు ఉన్నాయి. చాలా వరకు రివ్యూస్ లో వాటిని మెన్షన్ చేశారు. ఒకరిద్దరు వాటిని భూతద్దం పెట్టి చూస్తున్నారు. వాళ్ళు అంతే..!
కానీ మిగిలిన రివ్యూస్ మేము అనుకున్నట్టే వచ్చాయి. ఏ సినిమాని కూడా ఎవ్వరూ వంద శాతం కరెక్ట్ గా తీయరు. కొన్ని ఫ్లాస్ ఉంటాయి. అయితే మేము అనుకున్న మైనస్ లే చాలా మంది రాశారు కాబట్టి.. మాకు పెద్దగా కంప్లైంట్స్ లేవు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘హృదయం లోపల’ అనే మంచి పాట సినిమాలో లేదు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు కొంత హర్ట్ అయ్యారు.’మంచి పాటని ఎందుకు తీసేశారు?’ అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘అసలు సినిమాలో ఆ పాట పెట్టడానికి స్కోప్ లేదు. చాలా మంది ఈ కంప్లైంట్ చెబుతున్నారు. వాళ్ళు విజయ్ దేవరకొండ గారి కిస్ మిస్ అయ్యామని ఫీలవుతున్నట్లు ఉన్నారు’ అంటూ చమత్కరించాడు నాగవంశీ.
‘కింగ్డమ్’ ఫస్ట్ సింగిల్ గా ‘హృదయం లోపల’ పాటని రిలీజ్ చేశారు. పాట మంచి చార్ట్ బస్టర్ అయ్యింది. ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు అంటే అది మంచి పాట అని భావించే చిత్ర బృందం విడుదల చేస్తుంది. అలాంటి పాట మరి సినిమాలో లేకపోతే ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతారు కదా.