పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు. కానీ దాని షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అయినప్పటికీ చిత్ర బృందం మార్చి 28నే సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. వరుసగా పోస్టర్లు కూడా వదులుతుంది. దీంతో అభిమానులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాస్తవానికి సినిమా కనుక ఆ టైంకి వస్తే.. వాళ్ళు మాత్రమే కాదు.. ట్రేడ్ వర్గాలు, ఇండస్ట్రీ కూడా హ్యాపీనే.
ఎందుకంటే.. ‘తండేల్’ (Thandel) తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. మార్చి నెల మొదట్లో కొత్త సినిమాలు, చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రాలేదు. దీంతో బాక్సాఫీస్ డల్ గా ఉంది. ‘హరిహర వీరమల్లు’ వస్తే కచ్చితంగా మంచి వసూళ్లు సాధిస్తుంది. టాక్ బాగుంటే హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడతాయి. ఇదిలా ఉండగా.. ‘హరిహర వీరమల్లు’ వస్తుండగా ‘మ్యాడ్ స్క్వేర్’ ని ఎలా రిలీజ్ చేస్తున్నారు? అంటూ ఈరోజు జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రెస్ మీట్లో నిర్మాత నాగవంశీని ప్రశ్నించారు రిపోర్టర్లు.
అందుకు నాగవంశీ (Suryadevara Naga Vamsi) చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. ‘ ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా వస్తే.. మా ‘మ్యాడ్ స్క్వేర్’ ని రిలీజ్ చేయను’ అంటూ సమాధానం ఇచ్చాడు. అసలు పెద్ద సినిమా వస్తుంది అంటే చిన్న సినిమాలను పోటీగా రిలీజ్ చేయరు. కానీ నాగవంశీ (Naga Vamsi) అనౌన్స్ చేశారు అంటే ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ని సంప్రదించకుండా చేస్తారా? పైగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినటువంటి నితిన్ సినిమా కూడా మార్చి 28న విడుదల అవుతుంది అని ప్రకటించారు. నితిన్ (Nithin Kumar) మాత్రం తన అభిమాన హీరో సినిమా పక్కన రావడానికి ఎందుకు సిద్ధమవుతాడు?