మరో రెండు రోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు ప్యానెల్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మెగాబ్రదర్ నాగబాబు తన మద్దతుని తెలియజేశారు. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్ లైన్ టికెటింగ్ గురించి పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పే విషయాలను కచ్చితంగా ఫాలో అవుతామని.. ఎందుకంటే వాళ్లు మంచి మాటలే చెబుతారని.. చెడు మాట్లాడరని అన్నారు నాగబాబు. పవన్ కళ్యాణ్ పై పోసాని అలా మాట్లాడడంపై మీరెలా స్పందిస్తారని అడిగితే.. ‘కొందరి పేర్లను నా నోటితో చెప్పి నా నోరు పాడు చేసుకోలేను’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఇక ‘మా’లో జరుగుతున్న రాజకీయ పార్టీల ప్రమేయం గురించి స్పందించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనేది 900 మంది సభ్యులున్న చిన్న సంస్థ అని.. ఇలాంటి దానిలో రాజకీయ పార్టీల పాత్ర ఉంటుందంటే ఒప్పుకోనని అన్నారు. ముందునుంచి కూడా మెగా ఫ్యామిలీ సభ్యులు, ఇండస్ట్రీలోని హీరోలు ప్రకాష్ రాజ్ కి మద్దతుని తెలియజేస్తున్నామని.. తను ‘మా’ అధ్యక్షుడైతే బాగుంటుందనిపించి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చాలా రోజులుగా ‘మా’కు అధ్యక్షుడిగా చేసి ఏదో చేయాలని ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాడని.. ఆయన ఆలోచనలు నచ్చడంతో సపోర్ట్ చేస్తున్నామని అన్నారు.