నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘మా’ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘ ‘మా’ కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయి, కె.సి.ఆర్ ప్రభుత్వాన్ని ఓ ఎకరం అడిగితే ఇవ్వలేరా? అంటూ బాలకృష్ణ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై నాగబాబు పరోక్షంగా స్పందించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు.’మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమే, భవనం నిర్మించడానికి సేకరించలేదు అని ఆయన అన్నారు.
అందరూ భవనం గురించే మాట్లాడుతున్నారు.. గతంలో మురళీమోహన్ గారు దాని కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ రాజకీయ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ‘మా’ ని నమ్ముకుని ఉన్న పేద కళాకారులు మరియు సభ్యుల సంక్షేమం దృష్టి రీత్యా భవనం నిర్మాణం కాలేదు. ప్రకాష్ రాజ్ కు ఓ విజన్ ఉంది. విష్ణు కామెంట్స్ సరైనవి కాదు అనేలా నాగబాబు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ విషయం పై నాగబాబు మరోసారి స్పందించారు. ‘ఏకగ్రీవం అనేది సరైన పద్ధతి కాదు అని నేను అన్నాను.
ఇందులో ఎవర్నో తప్పు పట్టే ఉద్దేశం నాకు లేదు. భవనం నిర్మాణం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ‘మా’ ని నమ్ముకుని ఉన్న 900 మందిని కూడా పట్టించుకోవాలి కదా. ఇన్కమ్ జెనరేషన్ గురించి పట్టించుకోవాలి. భవనం అనేది తర్వాత మేటర్. ముందు అందరి కుటుంబాలు బాగుండాలి. అభివృద్ధి పనులు చేపట్టాలనేది మా ఆకాంక్ష’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.