అక్కినేని నాగార్జున గ్రీకు వీరుడు మాత్రమే కాదు.. ప్రయోగాల వీరుడు. స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి కొత్త కథలను చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. చిన్న, పెద్ద అని ఆలోచించకుండా హీరోలందరితో మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. గతంలో సుమంత్, మంచు విష్ణు, కార్తీ, రోషన్ తదితరులతో కలిసి సినిమాలు చేసిన నాగార్జున తాజాగా నాని తో కలిసి నటించనున్నారు. ప్రస్తుతం నాగ్, నాని ఇద్దరు తమ ప్రాజక్ట్ లలో బిజీగా ఉన్నారు.
ఈ ఏడాది అంతా డేట్స్ ఖాళీ లేవు. అయితే వచ్చే ఏడాదిలో ఈ మల్టీ స్టారర్ మూవీ చేయాలనీ ఓ బడా నిర్మాత ప్లాన్ చేశారని సమాచారం. ఈ కథకు ఇద్దరూ ఒకే చెప్పారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ, నిర్మల కాన్వెంట్ రెండూ నిరాశ పరచడంతో నాగార్జున ఇప్పుడు ఓంకార్ దర్శకత్వంలో చేస్తున్న రాజుగారి గది 2 సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.