ఇప్పుడు స్టార్ హీరోలంతా బిజీ బిజీ. వాళ్ళు రెండేళ్ళకి ఒక సినిమా అన్నట్టు లాగించేస్తున్నారు. పైగా 2030 వరకు ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పండక్కి వాళ్ళ సినిమాలు రావడం కష్టంగా మారింది. అందుకే ఈ టైంని క్యాష్ చేసుకోవాలని సీనియర్ స్టార్ హీరోలు డిసైడ్ అయిపోయారు. అవును ఒక రకంగా ఒకప్పటి రోజులు తిరిగొచ్చినట్టే. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna) , నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh).. వీళ్ళు ఒకప్పుడు టాలీవుడ్ కి పిల్లర్స్ లాంటివాళ్ళు.
Nagarjuna
ఇప్పుడు కూడా వీళ్ళ హవా నడుస్తోంది అని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. ‘అఖండ’ తో (Akhanda) బాలయ్య సూపర్ ఫామ్లోకి వచ్చాడు. ఆ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు. చిరు కూడా ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi No. 150) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి సినిమాలతో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి తన స్టామినా ఏంటనేది గుర్తు చేశారు. వెంకటేష్ కూడా ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి సినిమాలతో వంద కోట్ల క్లబ్లో చేరాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో అయితే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరాడు.
సో ఈ లిస్టు లో నాగ్ మాత్రం వెనుకబడ్డాడు.నాగ్ కెరీర్లో వంద కోట్ల సినిమా ఇంకా చేరలేదు. గతేడాది ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినా అది… చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ కాదు. ఆ సక్సెస్ క్రెడిట్ సంక్రాంతి, అల్లరి నరేష్ (Allari Naresh) వంటి వాళ్లకి కూడా వెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సినిమా పడితే నాగార్జున కూడా వంద కోట్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది. 2015 వంటి టైంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ (Soggade Chinni Nayana) సినిమా రూ.80 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’(Kubera) అయితే ఆఫ్ బీట్ మూవీలో నటిస్తున్నారు. అలాగే రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లో నటిస్తున్నాడు. నాగ్ ఫ్యాన్స్ హోప్స్ అన్నీ ‘కూలీ’ పైనే పెట్టుకున్నారు. అది హిట్ అయినా నాగ్ కి క్రెడిట్ రాదు. కానీ నాగ్ (Nagarjuna) మరోసారి తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి అది పనికొస్తుంది. ఆ నెక్స్ట్ సినిమాకి మైలేజ్ చేకూరుతుంది.