బాలీవుడ్‌లో కమర్షియల్ మాస్ హీరోను పెట్టుకుని.. సందేశాన్ని మేళవించి బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనకు ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ లేదంటే నమ్ముతారా? ఆయనే రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani). బాలీవుడ్‌లో ఆయన తెరకెక్కించిన సినిమాల పేర్లు చెబితే.. మీరూ ఇదే మాట అంటారు. ‘డంకీ’ (Dunki) సినిమాతో రెండేళ్ల క్రితం మంచి విజయం అందుకున్న ఆయన ఇప్పుడు తన హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా తీసే ఆలోచనలో ఉన్నారట.
‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’ (Lage Raho Munna Bhai) అంటూ సంజయ్ దత్‌తో (Sanjay Dutt) రాజ్‌కుమార్ హిరానీ రెండు సినిమాలు తెరకెక్కించారు. సంజయ్ దత్‌కు డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చి, బ్లాక్ బస్టటర్ ఇచ్చిన సినిమాలు అవి. ఇప్పుడు ఈ సిరీస్‌లోనే మూడో సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అందులో సంజయ్ దత్ హీరోగా నటిస్తాడట. అలాగే మరో కీలక పాత్ర కోసం అక్కినేని నాగార్జునను సంప్రదించారు అని సమాచారం. దానికి ఆయన కూడా ఓకే అన్నారు అని తెలుస్తోంది.
ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రాజ్ కుమార్ హిరానీ అలా నాలుగు సినిమాలు చేసి ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమా చేశారు. ఆ తర్వాత ‘లగే రహో మున్నాభాయ్’, ‘3 ఇడియట్స్’ (3 Idiots), ‘పీకే’, ‘సంజు’, ‘డంకీ’తో అలరించరు. పైన చెప్పినట్లు ఈ సినిమాలన్నీ మంచి విజయం అందుకున్నాయి. నటించిన హీరోలకు గొప్ప పేరు కూడా తీసుకొచ్చాయి. ఇప్పుడు మూడో ‘మున్నాభాయ్’తో అదే పని చేసే ఆలోచనలో ఉన్నారాయన.
ఇక నాగార్జున (Nagarjuna) సంగతి చూస్తే.. ప్రస్తతం ధనుష్ (Dhanush) ‘కుబేర’(Kubera), రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇవి తప్ప కొత్త సినిమా ఏదీ ఆయన అంగీకరించడం లేదు. హీరోగా ఆయన ఇప్పుడు ఏ సినిమా కూడా చేయడం లేదు. దీంతో త్వరలో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని వార్తలొస్తున్నాయి ఈ సమయంలో ‘మున్నాభాయ్ 3’ అంటే నాగార్జున ఆలోచనలు ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకు సోలో హీరోగా సినిమాలు ఓకే చేయడం లేదో ఆయనే చెప్పాలి.